బీజేపీ నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ నాయకురాలు విజయశాంతి(Vijayashanti) సోషల్ మీడియా(Social) వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఫిర్యాదుదారులపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై, బీజేపీ(BJP) వ్యతిరేక పార్టీలు, మీడియా వ్యతిరేక ప్రచారం తదితర అంశాలపై స్పందించారు. బీజేపీని తెలంగాణ(Telangana)లో నెలల తరబడి నష్టపరిచే ధోరణిలో నడిచిన చిట్ చాట్‌లు(ChitChat), న్యూస్ లీక్‌లు(News leaks), బీజేపీ వ్యతిరేక మీడియా(Anti BJP Media) సృష్టించిన సమస్యను అర్థం చేసుకున్న పార్టీ కార్యకర్తలు.. ఎప్పటిలానే ఇప్పుడు కూడా రాష్ట్రం కోసం, దేశం కోసం, ధర్మం కోసం దీక్షా స్ఫూర్తితో పనిచేయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్ర పార్టీలో కొంత మంది ఫిర్యాదు చేయడమే పనిగా, కుట్రపూర్వకంగా పనిచేస్తున్నారు.. ఈ ఫిర్యాదుల విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదనే బండి సంజయ్(Bandi Sanjay) వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అవి వాస్తవ సామీప్యతా ఉన్న వాఖ్యలుగా తప్పక చూడాల్సివుందని అన్నారు. బీజేపీ వ్యతిరేకుల, వ్యతిరేక మీడియా ప్రాయోజిత అంశాలను అధిగమించి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) నేతృత్వంలో డాక్టర్ లక్ష్మణ్(Doctor Laxman), బండి సంజయ్ సాధించిన ఫలితాల బాటలో బీజేపీ మరెన్నో గణనీయ విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే.. పార్టీలో ఓ వర్గం అసంతృప్తితో ఉందనే వార్తల నేపథ్యంలో సంజయ్ వ్యాఖ్యలను ప్రస్తావించడంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలనేది ఆమె ఉద్దేశం అని కొందరు అంటుండగా.. అసంతృప్తుల పట్ల విజయశాంతి కూడా అసంతృప్తిగానే ఉన్నారని కొందరు అంటున్నారు.