Vijayashanti Congress : కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి
ఇటీవల బీజేపీకి(BJP) రాజీనామా చేసిన విజయశాంతి(Vijayashanti).. బంజారాహిల్స్(Banjara Hills) లోని తాజ్ కృష్ణ హోటల్(Taj Krishna) లో ఏఐసీసీ(AICC) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో(Mallikarjun Kharge) సమావేశమయ్యారు. అనంతరం ఆమె కాంగ్రెస్‌లో చేరారు.
ఇటీవల బీజేపీకి(BJP) రాజీనామా చేసిన విజయశాంతి(Vijayashanti).. బంజారాహిల్స్(Banjara Hills) లోని తాజ్ కృష్ణ హోటల్(Taj Krishna) లో ఏఐసీసీ(AICC) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో(Mallikarjun Kharge) సమావేశమయ్యారు. అనంతరం ఆమె కాంగ్రెస్‌లో చేరారు. మల్లికార్జున్ ఖర్గే ఆమెకు కాంగ్రెస్(Congress) కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయశాంతి చేరిక సందర్భంలో ఆమె వెంట ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్ భాబు తదితరులు ఉన్నారు.
బండి సంజయ్‌ను(Bandi Sanjay) బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పించిన నాటి నుంచి విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే విజయశాంతి ఎన్నికల బరిలో ఉంటారని రాష్ట్ర నాయకత్వంతో పాటు పార్టీ శ్రేణులు భావించాయి. కానీ అమె ఎన్నికల బరిలో లేరు. అప్పటి నుంచి పార్టీ మారుతారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. అనుకున్నట్లుగానే ఆమె కాంగ్రెస్‌లో చేరారు.