మొన్నటి నుంచి కాంగ్రెస్‌(congress) నాయకురాలు విజయశాంతిపై(Vijayashanti) సోషల్‌ మీడియాలో(social media) కథనాలు వచ్చాయి. ఆమె కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారని, పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదని, గాంధీభవన్‌కు(Gandhi Bhavan) అసలు రావడమే మానేశారని వార్తలు వచ్చాయి. ఆమె మళ్లీ గులాబీ(BRS) గూటికి చేరుకోబోతున్నారని కూడా కొందరు రాశారు. అయితే వెబ్‌సైట్లలో, సోషల్‌ మీడియాలలో వస్తున్న కథనాలపై విజయశాంతి రియాక్టరయ్యారు.

మొన్నటి నుంచి కాంగ్రెస్‌(congress) నాయకురాలు విజయశాంతిపై(Vijayashanti) సోషల్‌ మీడియాలో(social media) కథనాలు వచ్చాయి. ఆమె కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారని, పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదని, గాంధీభవన్‌కు(Gandhi Bhavan) అసలు రావడమే మానేశారని వార్తలు వచ్చాయి. ఆమె మళ్లీ గులాబీ(BRS) గూటికి చేరుకోబోతున్నారని కూడా కొందరు రాశారు. అయితే వెబ్‌సైట్లలో, సోషల్‌ మీడియాలలో వస్తున్న కథనాలపై విజయశాంతి రియాక్టరయ్యారు. ఆమె ట్విట్టర్‌ (ఎక్స్‌)లో క్లారిటీ ఇచ్చుకున్నారు. తనేమిటో, తన ధోరణి ఏమిటో సూటిగా చెప్పారు. ఇంతకీ ఆమె ఏం చెప్పారంటే..
'ప్రభుత్వం వైపు కన్నా.ప్రజల వైపు ఉండటం ఎందుకో నాకు ఒక ధోరణి, ఎప్పుడూ నా తిరుగుబాటు స్వభావపు సినిమా పాత్రల ప్రేరణ కావచ్చు, బహుశా అందుకు కారణం. కొంతమంది విమర్శించినా.. ఎందుకో అదే విధానం నన్ను అట్లముందుకు నడిపిస్తూనే వస్తున్నది.ప్రతిపక్షంల ఉన్నంత పోరాట స్ఫూర్తి, స్వేచ్ఛ అధికారపక్షంల సాధ్యపడకపోవడం కూడా ఒక వాస్తవమేమో తెలియదు నాకు, ఈ
26 సంవత్సరాల రాజకీయ గమనంలో...అయితే నేను గెలిపించనీకి పనిచేసిన నేటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చే సాఫల్యత తెలంగాణల సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
ముఖ్యమంత్రి రేవంత్ గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు మరియు మంత్రివర్గం ప్రజలకై ఆ దిశగా ఇప్పటికీ పనిచేస్తున్నరు కాబట్టి....అమలు ప్రారంభమైన
హామీలు దశలవారీగా పూర్తిస్థాయికి చేర్చబడి , ప్రభుత్వ కార్యాచరణ‌ విజయం దిశగా సాగాలని నా అభిప్రాయం తెలియజేస్తూ...
లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించగలదని విశ్వసిస్తూ...
హర హర మహాదేవ్
జై తెలంగాణ' అంటూ ముగించారు. దీంతో రెండు మూడు రోజులుగా విజయశాంతిపై వస్తున్న స్టోరీలు అవాస్తవాలని తేలిపోయింది.

Updated On 23 April 2024 12:29 AM GMT
Ehatv

Ehatv

Next Story