మాజీ సీఎం కేసీఆర్‌పై తన వ్యతిరేకతను కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మరోమారు వెళ్లగక్కారు.

Vijayashanti Comments on Revanth Reddy Ruling
మాజీ సీఎం కేసీఆర్(Ex CM KCR)పై తన వ్యతిరేకతను కాంగ్రెస్(Congress) నాయకురాలు విజయశాంతి(Vijayashanti) మరోమారు వెళ్లగక్కారు. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ గత ప్రభుత్వ పాలనలో పని, సెలవు దినాలపై వ్యవహరించిన తీరును ఎండగట్టారు. ఆమె సోషల్ మీడియా పోస్టులో.. పని దినాలు(Working Days) సెలవు దినాలు(Holidays)గా, సెలవు దినాలు ఎట్లానూ సెలవు దినాలుగా నడిచిన గత సీఎం కేసీఆర్ ప్రభుత్వం.. పని దినాలు పనిచేసే దినాలుగా.. సెలవు దినాలు కూడా ప్రజల కోసం, అవసరమైనప్పుడు పని చెయ్యాల్సిన దినాలుగా నడుస్తున్న ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కాంగ్రెస్ ప్రభుత్వంల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిశీలన ప్రభావం 2024 లోక్‌సభ ఎన్నికల(Loksabha Elections)ల్ల.. 14 సుమారు స్థానాలు కాంగ్రెస్ గెలిచినప్పుడు తెలుస్తదని రాసుకొచ్చారు.
ఇదిలావుంటే విజయశాంతి 1998లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎన్నికలకు ముందు ఆమె బీజేపీలో ఉండగా.. అధిష్టాన తీరు నచ్చక కాంగ్రెస్‌లో చేశారు. ఏ పార్టీలో ఉన్నా ఆమె ప్రజా సమస్యలపై గళం విప్పుతూనే ఉంటారు. అలా ముక్కుసూటిగా వ్యవహరించే ఆమె తీరు నచ్చక.. టీఆర్ఎస్(TRS) నుంచి బహిష్కరణ వేటుకు కూడా గురయ్యారు.
