ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావాలని కోరుకోవడం రాజకీయంగా బీజేపీకి అవసరం కాదని.. ఆ ఆవశ్యకత కూడా లేదని ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు విజ‌య‌శాంతి అన్నారు.

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్(MLC Kavitha Arrest) కావాలని కోరుకోవడం రాజకీయంగా బీజేపీ(BJP)కి అవసరం కాదని.. ఆ ఆవశ్యకత కూడా లేదని ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు విజ‌య‌శాంతి(Vijayashanthi) అన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలలోని ఆయా సమస్యలపై నిర్దేశించబడ్డ ప్రభుత్వ సంస్థలైన ఈడీ(ED), సీబీఐ(CBI)లు తమ నిర్వహణ చేస్తాయని వివ‌రించారు. ఎంఐఎం(MIM) ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత అరెస్ట్ కానట్లయితే.. బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) ఒక్కటే అన్న భావంతో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు చెయ్యవచ్చన్న భయం బీఆర్ఎస్‌కు ఉందేమో గానీ... జాతీయవాద బీజేపీకి ఆ ఆలోచనా ధోరణి ఉండదని స్ప‌ష్టం చేశారు. గతంలో ఒకసారి అప్రూవర్‌గా ఉండి.. మళ్లీ కిలాఫ్‌గా మారి.. తిరిగి ఈ రోజు అప్రూవర్‌గా మారుతున్నోళ్లు బీఆర్ఎస్ ప్రోద్బలంతోనే ఇయ్యన్నీ చేస్తున్నారనే అభిప్రాయం వినవస్తున్నదని ఆమె సందేహం వ్య‌క్తం చేశారు. ఇక, ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు.. ఆరోపణలున్న ఏ ఆడబిడ్డ అయినా నిర్దోషులుగానే ఎప్పుడూ నిలవాలని మాత్రం వ్యక్తిగతంగా రాములమ్మ(Ramulamma) ఎన్నటికీ కోరుకుంటుంద‌ని ట్వీట్(Tweet) చేశారు.

Updated On 14 Sep 2023 11:32 PM GMT
Yagnik

Yagnik

Next Story