తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections) ముంచుకొస్తున్నాయి. మహా అయితే మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. అధికార బీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌(Congress), బీజేపీలు(BJP) గెలుపు గుర్రాల అన్వేషణలో పడ్డాయి. సిట్టింగులు గాభరా పడాల్సిన అవసరం లేదని, దాదాపు అందరికీ టికెట్లు దొరుకుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) అంటున్నప్పటికీ ఎవరి భయం వారిది! ఎమ్మెల్యే టికెట్‌ కోసం ఆశపడుతున్న వారంతా తమకు అనుకూలమైన నియోజకవర్గంలో కర్చీఫ్‌ వేసుకుంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections) ముంచుకొస్తున్నాయి. మహా అయితే మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. అధికార బీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌(Congress), బీజేపీలు(BJP) గెలుపు గుర్రాల అన్వేషణలో పడ్డాయి. సిట్టింగులు గాభరా పడాల్సిన అవసరం లేదని, దాదాపు అందరికీ టికెట్లు దొరుకుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) అంటున్నప్పటికీ ఎవరి భయం వారిది! ఎమ్మెల్యే టికెట్‌ కోసం ఆశపడుతున్న వారంతా తమకు అనుకూలమైన నియోజకవర్గంలో కర్చీఫ్‌ వేసుకుంటున్నారు.

ఈ క్రమంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి(Vijayshanthi) కూడా తనకు అనువైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం! అక్కడ నుంచి పోటీ చేస్తే గెలుపు సునాయసంగా లభిస్తుందని ఆమె గట్టిగా నమ్ముతున్నారట! ఆ నియోజకవర్గంలో బీజేపీ క్యాడర్‌కు ఉన్న బలాన్ని పరిగణనలోకి తీసుకునే రాములమ్మ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. జరగబోయే ముక్కోణపు పోటీలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది విజయశాంతి భావన! విజయశాంతి దృష్టి పెట్టిన నియోజకవర్గం గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న జూబ్లీహిల్స్‌(Jubilee Hills).

ప్రస్తుతం అక్కడ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌(Maganti Gopinath) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్‌ తరఫున మాగంటి గోపీనాథే పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్‌(Congress) నుంచి దివంగత ఎమ్మెల్యే పి. జనార్ధన్‌రెడ్డి(P.Janardhan Reddy) కుమారుడు పి.విష్ణువర్థన్‌రెడ్డి పోటీ చేయవచ్చు. 2018 ఎన్నికల్లో విష్ణువర్దన్‌ రెడ్డి రెండోస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే! 2014లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్‌ తరఫున పోటీ చేసిన నవీన్‌ యాదవ్‌ అనూహ్యంగా రెండో స్థానంలో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచారు.

అప్పుడు టీడీపీ నుంచి పోటీ చేసిన మాగంటి గోపీనాథ్‌కు 50,898 ఓట్లు వస్తే, నవీన్‌యాదవ్‌కు 41,656 ఓట్లు రావడం గమనార్హం. 2018 ఎన్నికల్లో మజ్లిస్‌ టికెట్ ఇవ్వకపోవడంతో నవీన్‌ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. సుమారు 19 వేల ఓట్లను దక్కించుకున్నారు. నవీన్‌ యాదవ్‌ ఇండిపెండెంట్‌గా పోటీచేయడంతో గోపీనాథ్‌ విజయం సులువయ్యింది. 2018లో జూబ్లీహిల్స్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా రావుల శ్రీధర్‌రెడ్డి పోటీ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర విద్యాసంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఒకవేళ పార్టీ అధిష్టానం జూబ్లీ హిల్స్‌ టికెట్‌ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మాగంటి గోపీనాథ్‌కు బీఆర్‌ఎస్‌ అధిష్టానం మళ్లీ ఓ అవకాశం ఇస్తుందా? లేక నియోజకవర్గంలో జరిపిన సర్వే ఆధారంగా నిర్ణయం మార్చుకుంటుందా అన్నది చూడాలి. బీజేపీ నుంచి పోటీ చేసిన రావులకు ఎనిమిదన్న వేలకుపైగా ఓట్లు వచ్చాయి. ఆ లెక్కన నియోజకవర్గంలో బీజేపీకి కొంత బలం ఉన్నదనే అనుకోవాలి. ఇప్పుడు విజయశాంతి అక్కడి నుంచి పోటీ చేస్తానంటే బీజేపీ కాదనదు. ఎందుకంటే విజయశాంతి జనాకర్షణ కలిగిన నాయకురాలు. ఆమె సొంతంగా ఓట్లను సంపాదించుకోలరు.

పైగా కొన్నాళ్లుగా ఆమె జూబ్లీహిల్స్‌లో ప్రజోపకర కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయశాంతితో పాటుగా డాక్టర్‌ వీరపనేని పద్మ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. బీజేపీ జాతీయ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా పార్టీ క్యాడర్‌కు ఆమె పరిచయమే! రైజ్‌ ఫౌండేషన్‌ ద్వారా ఆమె ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. రిటైర్డ్‌ ఐపీఎస్‌ నర్సయ్య కూతురుగా పద్మ బ్యూరోక్రాట్లకు కూడా పరిచయమే! మరోవైపు జూటూరు కీర్తి రెడ్డి కూడా బీజేపీ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఆమె కూడా కీర్తి రెడ్డి ఫౌండేషన్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలను జరుపుతున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లంకల దీపక్‌ రెడ్డి కూడా టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మరి ఈ ముగ్గురిని కాదని విజయశాంతికి బీజేపీ అధిష్టానం టికెట్ ఇస్తుందా? అన్నదే ప్రశ్న!

Updated On 15 Aug 2023 2:01 AM GMT
Ehatv

Ehatv

Next Story