వర్తమాన రాజకీయాలలో(Politics) టైమింగ్‌ చాలా ముఖ్యం. ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలనేదానిపై పూర్తి అవగాహన ఉన్నవారే రాజకీయాలల్లో సక్సెస్‌ సాధించగలరు. సినిమాలలో లేడి సూపర్‌స్టార్‌గా వెలుగుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతికి(Vijayashanthi) ఎందుకో సమయం, సందర్భం కలిసి రావడం లేదు. ప్రతీసారి ఆమె అంచనాలు తప్పుతున్నాయి.

వర్తమాన రాజకీయాలలో(Politics) టైమింగ్‌ చాలా ముఖ్యం. ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలనేదానిపై పూర్తి అవగాహన ఉన్నవారే రాజకీయాలల్లో సక్సెస్‌ సాధించగలరు. సినిమాలలో లేడి సూపర్‌స్టార్‌గా వెలుగుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతికి(Vijayashanthi) ఎందుకో సమయం, సందర్భం కలిసి రావడం లేదు. ప్రతీసారి ఆమె అంచనాలు తప్పుతున్నాయి. ఆమె రాజకీయ జీవితం భారతీయ జనతా పార్టీ(BJP) నుంచే మొదలయ్యింది. సినిమాల్లో ఉన్నప్పుడే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు.1998లో ఆమె బీజేపీలో చేరారు. చేరిన వెంటనే బీజేపీ మహిళా విభాగం (భారతీయ మహిళామోర్చా) కార్యదర్శి అయ్యారు.

ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పిన బీజేపీ అధికారంలోకి రాగానే ఆ ఊసేత్తకపోవడం విజయశాంతికి నచ్చలేదు. తెలంగాణపై బీజేపీ నాన్చుడు ధోరణిని అవలంబిస్తుందని చెప్పి అందులోంచి బయటకు వచ్చేశారు. తానే స్వయంగా తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. పార్టీని ఎక్కువ కాలం నడపలేకపోయారు. టీఆర్‌ఎస్‌లో(TRS) పార్టీని విలీనం చేశారు. రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. 2009లో ఆమె టీఆర్‌ఎస్‌ తరఫున మెదక్‌(Medak) లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించారు.

టీఆర్‌ఎస్‌లో ఆమె చురుకైన పాత్రనే పోషించారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్‌తో విభేదాలు రావడంతో టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్‌లో(congress) చేరి మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఓడిపోయారు. కొన్నాళ్ల పాటు స్తబ్దుగా ఉన్నారు. కాంగ్రెస్‌ అధినాయకత్వం 2018లో విజయశాంతిని పీసీసీ ఎన్నికల ప్రచార కమిటీకి స్టార్‌ క్యాంపెయినర్‌గా, సలహాదారుగా నియమించింది.

అప్పుడు నరేంద్రమోదీపై తీవ్ర విమర్శలు చేశారు. తీవ్రవాదితో పోల్చారు. చిత్రమేమిటంటే సరిగ్గా ఏడాదికి ఆమె కాంగ్రెస్‌కు రాజీనామా ఏసి బీజేపీలో తిరిగి చేరారు. బీజేపీలో చేరితే చేరారు కానీ అందులో ఆమెకు తగిన గుర్తింపు లభించలేదు. తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. విజయశాంతికి ఈ అయోమయం ఏమిటో అర్థం కావడం లేదు. ఏ పార్టీలోనూ ఆమె స్థిరంగా ఉండటం లేదు. ఏ పార్టీలో కొనసాగాలో ఆమె తేల్చుకోలేకపోతున్నారు.

తరచూ పార్టీలు మారుతుండటంతో ఆమె రాజకీయాల్లో విజయం సాధించలేకపోతున్నారు. 2014 ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌లోనే ఉండి ఉంటే ఆమె ఎమ్మెల్యేనో, ఎంపీనో అయ్యేవారు. అదృష్టం కలిసివస్తే మంత్రి కూడా అయ్యేవారేమో! కాంగ్రెస్‌లో గట్టిగా ఉన్నారా అంటే అదీ లేదు. బీజేపీలో స్థిరపడ్డారా? అక్కడా లేదు. బీఆర్‌ఎస్‌ను ఓడించే శక్తి బీజేపీలో లేదని, కాంగ్రెస్‌ అయితేనే బీఆర్‌ఎస్‌ ప్రత్యామ్నాయమని చెబుతూ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

జనసేనతో బీజేపీ పొత్తుపెట్టుకోవడం విజయశాంతికి సుతరామూ ఇష్టం లేదట! ఆ కారణంతోనే విజయశాంతి బయటకు వచ్చారనే టాక్‌ నడుస్తోంది. ఎన్నికలకు పక్షం రోజులు కూడా లేవు. ఈ టైమ్‌లో విజయశాంతి పార్టీ మారడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ చేసే రాజీనామా ఏదో ముందే చేసి ఉంటే కాంగ్రెస్‌లో ఈమెకు కీలక పాత్ర పోషించే అవకాశం దక్కేది. మొత్తంగా విజయశాంతికి కాలం కలిసి రావడం లేదు.

Updated On 17 Nov 2023 2:59 AM GMT
Ehatv

Ehatv

Next Story