ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR) గజ్వేల్‌తో(Gajwal) పాటుగా కామారెడ్డి(Kamareddy) నుంచి కూడా పోటీ చేయాలనే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ విజయం నల్లేరు మీద నడకేనన్న సంగతి అందరికీ తెలుసు. మరి కామారెడ్డి నుంచి కూడా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? కేసీఆర్‌ నిర్ణయం వెనుక ఉన్న దూరాలోచన ఏమిటి? గంప గోవర్ధన్‌ను(Gampa Govardhan) ఎక్కడ సర్దుబాటు చేస్తారు? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూనే వాటికి సమాధానాలు రాబ్టటే ప్రయత్నాల్లో మీడియా వర్గాలు ఉన్న సమయంలో ఫైర్‌బ్రాండ్‌ విజయశాంతి ఓ సంచలన నిర్ణయం తీసుకుని మీడియాను తనవైపుకు తిప్పుకున్నారు. కేసీఆర్‌కు పోటీగా తాను కామారెడ్డి నుంచి విజయశాంతి చేయబోతున్నారని విశ్వసనీయ సమాచారం.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR) గజ్వేల్‌తో(Gajwal) పాటుగా కామారెడ్డి(Kamareddy) నుంచి కూడా పోటీ చేయాలనే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ విజయం నల్లేరు మీద నడకేనన్న సంగతి అందరికీ తెలుసు. మరి కామారెడ్డి నుంచి కూడా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? కేసీఆర్‌ నిర్ణయం వెనుక ఉన్న దూరాలోచన ఏమిటి? గంప గోవర్ధన్‌ను(Gampa Govardhan) ఎక్కడ సర్దుబాటు చేస్తారు? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూనే వాటికి సమాధానాలు రాబ్టటే ప్రయత్నాల్లో మీడియా వర్గాలు ఉన్న సమయంలో ఫైర్‌బ్రాండ్‌ విజయశాంతి ఓ సంచలన నిర్ణయం తీసుకుని మీడియాను తనవైపుకు తిప్పుకున్నారు. కేసీఆర్‌కు పోటీగా తాను కామారెడ్డి నుంచి విజయశాంతి చేయబోతున్నారని విశ్వసనీయ సమాచారం. బీజేపీ(BJP) తరఫున బరిలో దిగనున్న విజయశాంతికి(Vijayshanthi) పార్టీ అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిందట! ఒకవేళ విజయశాంతి కనుక కామారెడ్డి నుంచి బరిలో దిగితే పోటీ అత్యంత ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా మారడం ఖాయం! ఎందుకంటే కాంగ్రెస్‌(Congress) తరపున సీనియర్‌ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ(Shabbir Ali) పోటీకి రెడీ అయ్యారు. అసలు కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేస్తారని షబ్బీర్‌ ఊహించి ఉండరు. కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేస్తారని గత కొద్ది రోజులుగా మీడియాలో కథనాలు వస్తున్నా ఈ విషయాన్ని చాలా మంది తేలిగ్గా తీసుకున్నారు. కేసీఆర్‌ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో బీజేపీ, కాంగ్రెస్‌ కూడా అలెర్టయ్యాయి. అక్కడ్నుంచి ప్రజాకర్షక నేత బరిలో దిగితేనే కేసీఆర్‌కు పోటీ నివ్వగలమని బీజేపీ భావిస్తోంది. విజయశాంతి అయితేనే కేసీఆర్‌కు ఎదురొడ్డి నిలవగరని అధిష్టానం అనుకుంటోంది. తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి ప్రధానభూమికను పోషించారు. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన సంగతి కూడా తెలుసు! ఆమె క్రౌడ్‌ పుల్లర్‌.. మంచి ప్రసంగీకురాలు కూడా! అందుకే విజయశాంతిని కేసీఆర్‌కు పోటీగా దింపాలని బీజేపీ అనుకుంటోంది. మరోవైపు విజయశాంతి కూడా ఇదే కోరుకుంటున్నారు. కేసీఆర్‌తో విజయశాంతికి ఎప్పట్నుంచో రాజకీయ వైరుధ్యం ఉంది. ఈ పోరులో పై చేయి సాధించి తన సత్తా ఏమిటో రుజువు చేసుకోవాలనే భావనతో విజయశాంతి ఉన్నారు. మరోవైపు గజ్వేల్‌లో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేస్తానని బీజేపీ నేత ఈటల రాజేందర్‌(Etala Rajender) చెప్పారు. అదే జరిగితే కేసీఆర్‌ పోటీ చేస్తున్న రెండు స్థానాలలో బీజేపీ నుంచి బలమైన నేతలు బరిలో దిగినట్టుగా అవుతుంది. మొత్తంమీద కామారెడ్డిలో ఓ ఆసక్తికరమైన పోరు జరగబోతున్నది

Updated On 21 Aug 2023 6:48 AM GMT
Ehatv

Ehatv

Next Story