మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.

Vijayashanthi Fire on BRS Leaders
మాజీ సీఎం కేసీఆర్9CM KCR)పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి(Vijayashanthi) సోషల్ మీడియా(Social Media) వేదికగా విమర్శలు గుప్పించారు. సుమారు 10 సంవత్సరాల తెలంగాణ(Telangana) ఖజానా మొత్తం కొల్లగొట్టి, 5 లక్షల కోట్ల అప్పు మన నెత్తిన పెట్టి ఎల్లిన గత దుర్మార్గ బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt).. అందుకు బాధ్యులైన నాటి బీఆర్ఎస్ మంత్రులు మూడు దినాలల్లనే నూతన సర్కారు అన్ని హామీలను అమలు చేయాలని ప్రశ్నించడం.. ప్రతిపక్షంగా అన్ని తెలిసి చేస్తున్న మోసపు ప్రకటనలు ప్రయత్నం, ఓటమి తట్టుకోలేని వ్యక్తుల వివాదంగా అభివర్ణించారు. విజ్ఞత, బాధ్యతా ధోరణితో ఉండే హరీష్ రావుతో కూడా ఇట్ల ఎందుకు మాట్లాడిస్తున్నరో దవాఖానలో ఉన్న కేసీఆర్ గారు.. తెల్వదు అని విమర్శించారు.
అయినా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఇచ్చిన మాట తప్పదు అన్నది వాస్తవం. అందుకై మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని, ప్రభుత్వాన్ని విమర్శించే శక్తులను సమర్ధవంతంగా తిప్పికొట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యాచరణను నిరంతరం ప్రజలకు చేర్చవలసిన బాధ్యత ఈ సందర్బంగా తెలంగాణల బీఆర్ఎస్ నియంతృత్వ గడిలనుండి విముక్తి కై కొట్లాడి నేటి ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకై పనిచేసిన మన వంటి తెలంగాణ ప్రజాస్వామ్యవాదులపై ప్రస్తుతం తప్పక ఉన్నదని గుర్తుచేశారు.
