రంగారెడ్ది(Ranga reddy) జిల్లా మహేశ్వరంలోని ఓ హోటల్లో ఓ దొంగ ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతారు.
రంగారెడ్ది(Ranga reddy) జిల్లా మహేశ్వరంలోని ఓ హోటల్లో ఓ దొంగ ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతారు. ఓ హోటల్లో(Hotel) చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరకకుండా ఏంతో జాగ్రత్తగా ప్లాన్ వేసి చేతులకు గ్లౌజులు, మొహానికి మంకీక్యాప్(Moneky cap) ధరించి తను ఎంచుకున్న స్పాట్ వద్దకు చేరుకున్నాడు. సీరియస్‌గా తాళం బద్దలుకొట్టి లోపలికి వెళ్లిన ఆ దొంగకు నిరాశ ఎదురైంది. వచ్చిన పని ఎలాగో కాలేదు ఈ యాజమాని ఎవరో ఒక్క రూపాయి దాచుకొకుండా ఇంటి హోటల్ చుట్టూ సీసీ కెమెరాలను(CCTC Camera) పెట్టుకున్నాడని భావించాడేమో చేసేది లేకా దూకుడు సినిమాలో నా నటన గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ అన్నట్లు నాగార్జునకు బ్రహ్మానందం సీసీ కెమెరా ముందు రిక్వెస్ట్ చేసినట్టుగా చేశాడు. ఒక్క రూపాయి అయినా పెట్టుకోలేదా అంటూ సీసీ కెమెరా ముందుకొచ్చి ఎద్దేవా చేశాడు.
పదో పరుకో పెట్టుకోపోతే దొంగలు ఎలా బతికేదని వేడుకున్నాడో...లేక మీవేం బతుకులు సామీ అంటూ ఒక్క రూపాయి అయినా పెట్టకపోతే ఎలా అని సీసీ కెమెరా ముందు సైగలు చేసినట్లు కనిపిస్తోంది. హోటల్ అంతా కలియ తిరిగినా ఏమీ దొరక్కపోవడంతో పక్కనే ఉన్న ఫ్రీడ్జ్ తీసి వాటర్ బాటిల్ దొంగిలించి బయటకు వెళ్లాడు. మళ్లీ ఎమనుకున్నాడో తిరిగి వచ్చి 20 రూపాయలు నోటును టేబుల్‌పై వేసి పండుగ చేస్కో అనే విధంగా సినిమా సన్నివేశాన్ని గుర్తు చేశాడు. దీంతో ఈ విడియో చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు.ఈ ఘటన రంగారెడ్ది జిల్లా మహేశ్వరం ఏమ్మార్వో ఆఫీస్ ముందున్న హోటల్లో చోటుచేసుకుది.