ఈరోజుల్లో ప్రీవెడ్డింగ్ షూట్(Pre Wedding shoot) అనేది కామనైపోయింది. వివాహం(Marriage) కంటే ముందు ప్రీవెడ్డింగ్ షూట్‌లకు కూడా లక్షల రూపాయలు ఖర్చుచేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇందుకోసం రకరకాల లొకేషన్లు, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో షూట్ చేసుకుంటున్నారు. బురదలో దొర్లడం, నదుల్లో జలకాలాటడడం, కర్గెట్లలో పండి పొర్లడం, కొండల్లో, గుట్టల్లో రొమాన్స్‌లు చేయడం..
ఈరోజుల్లో ప్రీవెడ్డింగ్ షూట్(Pre Wedding shoot) అనేది కామనైపోయింది. వివాహం(Marriage) కంటే ముందు ప్రీవెడ్డింగ్ షూట్‌లకు కూడా లక్షల రూపాయలు ఖర్చుచేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇందుకోసం రకరకాల లొకేషన్లు, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో షూట్ చేసుకుంటున్నారు. బురదలో దొర్లడం, నదుల్లో జలకాలాటడడం, కర్గెట్లలో పండి పొర్లడం, కొండల్లో, గుట్టల్లో రొమాన్స్‌లు చేయడం.. ఇలా సరికొత్తగా, క్రియేటివ్‌గా ఆలోచిస్తూ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తున్నారు. లోకేషన్లకు తగ్గట్టు సాంగ్స్ వేసుకుంటూ క్రియేటివిటిని వాడుతున్నారు. అయితే ఇది మరోరకమైన ప్రీ వెడ్డింగ్ షూటనే చెప్పాలి. ఈ జంట ప్రీవెడ్డింగ్ షూటింగ్ కోసం ఆర్టీసీ బస్సును(RTC Buses) సైతం వదల్లేదు. ఓ యువతి ఆర్టీసీ బస్సు నుంచి దిగుతుండగా వెనుక నుంచి వరుడు వస్తూ ఆమెను ఫాలో అవుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. హైదరాబాద్ రోడ్లు ఇప్పుడు పెళ్లి షూటింగ్‌ల స్పాట్‌గా మారాయా అని ప్రశ్నించారు. ఇలాంటి షూట్‌ల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం, భద్రతకు ముప్పు రాదా అని కొందరు అడగ్గా.. ఐదు సెకండ్ల షూట్‌కు ఇంత ఇష్యూ అవసరంలేదని కొందరు వాదిస్తున్నారు.