రేపు జగిత్యాల పట్టణ బంద్‌కు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ పిలుపునిచ్చాయి. ఎస్సై అనిల్ కు మద్దతుగా సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ జగిత్యాల పట్టణ బంద్ కి పిలుపునిచ్చాయి.
రేపు జగిత్యాల(Jagityal) పట్టణ బంద్(Bundh)కు విశ్వ హిందూ పరిషత్(Vishwa Hindu Parishad), బజరంగ్ దళ్(Bajarang Dal) పిలుపునిచ్చాయి. ఎస్సై అనిల్(SI Anil) కు మద్దతుగా సస్పెన్షన్(Suspension) ను ఎత్తివేయాలని డిమాండ్(Demand) చేస్తూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ జగిత్యాల పట్టణ బంద్ కి పిలుపునిచ్చాయి. మైనారిటీ వర్గానికి చెందిన ఓ మహిళపై దాడి చేశాడంటూ జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 9వ తేదీన జగిత్యాల బస్సు డిపో(Jagityal Bus Depo) దగ్గర ఆర్టీసీ బస్సు(RTC Depo)లో జరిగిన సంఘటనపై విచారణ అనంతరం ఎస్సై అనిల్ ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గురువారం డ్యూటీ నుండి సస్పెండ్ చేస్తూ.. ఎస్పీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే.. ఎస్సై అనిల్‌కు మద్దతుగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ రేపు జగిత్యాల పట్టణ బంద్‌కు పిలుపునిచ్చాయి. వెంటనే ఎస్సై అనిల్ సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి. ఎస్సై విషయంలో ఎలాంటి విచారణ జరగకుండానే సస్పెండ్ చేయడం ఏమిటని.. ఇది కక్ష సాధింపుచర్యగా కనిపిస్తోందని.. అందుకే శనివారం జగిత్యాల పట్టణ బందుకు పిలుపునిచ్చినట్లు విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది.