జూలై 1న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్-4 పరీక్షకు హాజరయ్యే హిందూ మహిళా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించే క్రమంలో మంగళ సూత్రం, మెట్టెలు, గాజులు, పట్టీలు, కుంకుమ వంటి హిందూ సంస్కృతిని ప్రతిబింబించే ఆభరణాలను తీసివేయించవద్దని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్ధన్ ను కలిసి భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు వినతి పత్రం సమర్పించారు.

జూలై 1వ తేదీ శనివారం రోజున తెలంగాణలోని 9 లక్షలకు పైగా అభ్యర్థులు గ్రూప్-4 పరీక్షకు హాజరవుతున్నారు. అందులో సగభాగం మహిళా అభ్యర్థులు ఉన్నారు. పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించే క్రమంలో హిందూ మహిళలు ఆభరణాలను తీసివేసిన తర్వాత వారిని లోపలికి అనుమతిస్తున్నారు. హిందూ మహిళ భర్త చనిపోతే తప్ప తీయని మంగళసూత్రాన్ని.. ఎగ్జామ్ సెంటర్ వద్ద తీసివేయిస్తున్నారు. ఇది హిందూ మహిళల మనోభావాలు తీవ్రంగా దెబ్బ తీసేలా ఉంది.
గత పరీక్షల నిర్వహణను దృష్టిలో ఉంచుకొని పరీక్షకు హాజరయ్యే హిందూ మహిళా అభ్యర్థుల మనోభావాలు దెబ్బతీసేలా వారి మెడలోని ఆభరణాలను తీసివేస్తేనే లోపలికి అనుమతిస్తామనే మీ సిబ్బంది ప్రవర్తన అమానవీయంగా ఉంది. ఇది ఖచ్చితంగా హిందూ మహిళలను అవమానపరిచినట్లేనని.. వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేసి పరీక్ష కూడా సరిగ్గా రాయకుండా చేస్తున్నారని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు అన్నారు. జులై 1న నిర్వహించే గ్రూప్-4 పరీక్షకు.. రాష్ట్రంలోని అన్ని పరీక్ష కేంద్రాలలో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు. మహిళా అభ్యర్ధుల మనోభావాలను కించపరచకుండా కాపాడాలని.. విశ్వహిందూ పరిషత్ మహిళా విభాగం కోరింది.