త్వరలోనే బిగ్‌బాస్ సీజన్ 8(Bigg Boss 8) ప్రారంభం కానుందని సమాచారం.
త్వరలోనే బిగ్‌బాస్ సీజన్ 8(Bigg Boss 8) ప్రారంభం కానుందని సమాచారం. ఈ షోలో పార్టిసిపేట్ చేసేవాళ్లు ఎవరెవరు ఉంటారని పలు రకాల వార్తలు వస్తున్నాయి. సీజన్ 7 సక్సెస్ కావడంతో ఈసారి ఈ షోపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే ఇందులో పాల్గొనాలనుకునే టెస్టులు కూడా నిర్వహిస్తున్నారట. ఈసారి సోషల్ మీడియా(Social meida) ఇన్‌ఫ్లూ ఎన్సర్లు ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ముఖ్యంగా ఈ షాకి ఈ సారి కూమారి ఆంటి వస్తారని చాలా వార్తలు వస్తున్నాయి. ఈవిడ ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయ్యింది. పలు టీవీ షోలు, ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా కనిపించింది. అంతేకాకుండా తెలంగాణలో నిరుద్యోగుల తరపున పోరాడుతానంటూ బయలెల్లిన బర్రెలక్క పేరు కూడా వినిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో ఈమె పేరు సోషల్ మీడియాలో మారుమోగి పోయింది.
తెలుగు ఇండస్ట్రీ ,రాజకీయరంగం రెండు రంగాల్లో ప్రముఖులు గురించి వారి జాతకాలు గురించి ప్రస్తావిస్తూ చేసిన కీలక వ్యాఖ్యలతో వేణు స్వామి పాపులారిటీ సంపాదించుకున్నారు. సెలబ్రిటీలకు జాతకం చెప్పడం, వారితో ప్రత్యేక పూజలు చేయించడంతో వేణు స్వామి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఎక్కువగా వైరల్ అయిన, ట్రోలింగ్‌కు గురైన వ్యక్తి వేణు స్వామి. ప్రభాస్ పని అయిపోయిందని, సినిమాలు హిట్ కావాని, తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ వస్తాడని చెప్పి దారుణంగా ట్రోలింగ్‌కు గురయ్యారు. ఏపీలో జగన్ వస్తాడని చెప్పడం.. రిజల్ట్స్ ఉల్టాపుల్టా కావడం.. .. ఇంకెప్పుడూ బహిరంగంగా ఇలాంటి విషయాల మీద జాతకాలు అంటూ చెప్పను అని వేణు స్వామి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అలాంటి వేణు స్వామి ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తున్నాడని సమాచారం.వేణుస్వామి బిగ్‌బాస్‌లోకి అడుగుపెడితే గట్టి కంటెంటే దొరుకుతుందని నిర్వాహకులు కూడా అంచనాలు వేస్తున్నారంట.
అయితే వేణుస్వామి(Venu Swamy) జాతకాలకు, పూజలకు బయట చాలా అమౌంట్ వస్తుందని టాక్. అందుకే ఆయన బిగ్ బాస్‌లోకి వెళ్తే చాలా మంది కంటే అతనికి రెమ్యునరేషన్ ఎక్కువే ఇవ్వాల్సి వస్తుందని భావిస్తున్నారు. వేణు స్వామి లోపలకి వెళ్తే ఎన్ని వారాలు ఉంటారు. అక్కడ కూడా కంటెస్టెంట్‌ల జాతకాలు చెప్తారా. ఒకవేళ అలా చెప్పాలనుకుంటే బిగ్‌బాస్ కండీషన్స్ విధిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అక్కడ కూడా జాతకాలు చెప్తూ కంటెంట్ క్రియెట్ చేస్తే ఆడియన్స్ కూడా ఎక్కువగా ఆకర్షితులై వ్యూయర్‌షిప్ చాలానే వస్తుందని విశ్లేషిస్తున్నారు. మరోవైపు కుమారి ఆంటి, బర్రెలక్క, వేణుస్వామిలాంటి వారు వస్తే బిగ్‌బాస్ ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది.