వేణుస్వామి(Venu Swamy)... ఈ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. పలువురు ప్రముఖుల జాతకాలు చెప్పడంతో పాటు సెలబ్రిటీలతో(Celebrities) యాగాలు, పూజలు చేయిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఎందరో ప్రముఖులతో ఆయన పూజలు చేయించారు. ఆయన చేత పూజలు చేయించుకున్న రష్మిక(Rashmika) ఇప్పుడు పాన్‌ఇండియా మూవీల్లో నటిస్తోంది. సమంత(Samantha)-నాగచైతన్య(Nagachaithanya) విడిపోతారని నేను ముందే చెప్పానంటూ అప్పట్లో వార్తల్లోకి ఎక్కారు. అయితే మరోసారి వేణుస్వామి సోషల్‌ మీడియాలో(social Media) గిరాగిరా తిరుగుతున్నాడు.. ఎక్కడ 'స్వామీ' అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

వేణుస్వామి(Venu Swamy)... ఈ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. పలువురు ప్రముఖుల జాతకాలు చెప్పడంతో పాటు సెలబ్రిటీలతో(Celebrities) యాగాలు, పూజలు చేయిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఎందరో ప్రముఖులతో ఆయన పూజలు చేయించారు. ఆయన చేత పూజలు చేయించుకున్న రష్మిక(Rashmika) ఇప్పుడు పాన్‌ఇండియా మూవీల్లో నటిస్తోంది. సమంత(Samantha)-నాగచైతన్య(Nagachaithanya) విడిపోతారని నేను ముందే చెప్పానంటూ అప్పట్లో వార్తల్లోకి ఎక్కారు. అయితే మరోసారి వేణుస్వామి సోషల్‌ మీడియాలో(social Media) గిరాగిరా తిరుగుతున్నాడు.. ఎక్కడ 'స్వామీ' అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఆయన చెప్పింది జరగలేదని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇతడిని నమ్ముకొని బెట్టింగ్‌లు(Betting) పెట్టి ఘోరంగా నష్టపోయామని వాపోతున్నారు. ఈ స్వామిని నమ్మి మోసపోయామని తమ చెప్పుతో తామే కొట్టుకుంటున్నారట బెట్టింగ్‌ రాజాలు..

'ముచ్చటగా మూడో సారి పక్కా సీఎం కేసీఆరే'(CM KCR)... ఈ వ్యాఖ్యలను ఘంటాపథంగా వేణుస్వామి చెప్పారు. లేదంటే నేను మళ్లీ ఇంకోసారి 'జోతిష్యం'(astrology) చెప్పనని సవాల్‌ కూడా విసిరారు. వేణుస్వామి గతంలో చెప్పిన కొన్ని వీడియోల్లో తెలంగాణలో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని, కేంద్ర రాజకీయాలను శాసిస్తారని చెప్పారు. 2023 జనవరి తర్వాత రాష్ట్రంలో, దేశంలో అనూహ్య మార్పులు సంభవిస్తాయన్నారు. పాలక, ప్రతిపక్ష నేతలు న్యాయ, ఆరోగ్య పరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణలో మూడోసారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని.. కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎం అవుతారని గట్టిగా వాదించారు. కేసీఆర్‌ కాకున్నా ఈ సారి కేటీఆర్‌(KTR) పక్కా సీఎం అవుతాడని తెలిపారు. ఒకవైపు ఎగ్జిట్‌ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌ వస్తుందని చెప్పడంతో ఉత్కంఠ పెరిగింది. తెలంగాణ ఫలితాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచేశారు. ఫలితాలు రానే వచ్చాయి. అయితే వేణుస్వామి చెప్పిన ప్రకారం కాకుండా.. తెలంగాణలో కాంగ్రెస్‌(congress) అధికారంలోకి వచ్చింది. సీఎంగా కేసీఆర్‌ తన పదవికి రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నారు. ఈరోజో, రేపు కాంగ్రెస్‌ కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు వేణుస్వామిపై పడ్డారు. వేణుస్వామి చెప్పినట్లు జరగకపోవడంతో.. ఆయన ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కేసీఆర్‌ మూడోసారి సీఎం కాకుంటే ఇకపై జ్యోతిష్యం చెప్పనన్న వేణు ఇప్పుడేం చేస్తున్నారు అని వెతకసాగారు. వేణుస్వామి పాత వీడియోలను తిరగదోడి సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ ట్రోల్స్‌పై వేణుస్వామి స్పందిస్తారా..? జ్యోతిష్యాన్ని బంద్ పెడతారా.. ? వేచి చూడాలి.

Updated On 4 Dec 2023 2:36 AM GMT
Ehatv

Ehatv

Next Story