తెలంగాణ(Telangana)లో రోజురోజుకు ఎండలు భయానకంగా మారుతున్నాయి. హైదరాబాద్(Hyderabad)లో కూడా అంతే! అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వెళ్లాలంటే వణికిపోతున్నారు ప్రజలు. ఇంట్లో ఉన్నా అదే పరిస్థితి. ఉక్కపోత కుదురుగా ఉండనివ్వడం లేదు. సూర్యుడు మండిపోతున్నాడు.
తెలంగాణ(Telangana)లో రోజురోజుకు ఎండలు భయానకంగా మారుతున్నాయి. హైదరాబాద్(Hyderabad)లో కూడా అంతే! అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వెళ్లాలంటే వణికిపోతున్నారు ప్రజలు. ఇంట్లో ఉన్నా అదే పరిస్థితి. ఉక్కపోత కుదురుగా ఉండనివ్వడం లేదు. సూర్యుడు మండిపోతున్నాడు. జనం అత్యవసరమైతే తప్ప బయటకు కాలు పెట్టడం లేదు. ఇలాంటి ఎండలను మునుపెప్పుడు చూడలేదని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలకే కాదు, వాహనాలకు కూడా ఎండలతో ముప్పు ఉందంటున్నారు ఆటో మొబైల్ రంగ నిపుణులు అంటున్నారు. వాహనాలను బయటపెట్టకూడదంటున్నారు. ఎండలకు అవి రంగు, రూపు కోల్పోతాయని, రిపైర్లు చేసుకోవాల్సి వస్తుందంటున్నారు. టైర్లు, సీట్లు, బ్యాటరీ, ఇంజిన్ లోపలి సున్నిత బాగాలు దెబ్బతింటాయి. ఇంధనం ఆవిరయ్యే ఆస్కారముంటుంది. కార్లలో ప్రమాదాల్లో కాపాడే ఎయిర్ బ్యాగ్‌లు కూడా దెబ్బతింటాయి. సీట్ల కుషన్లు, కవర్లు, అద్దాలు బలహీనమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఎండలో వాహనాలను నిలపాల్సి వస్తే మాత్రం వాటిని తరచూ నీటితో కడగాలని, కారు అద్దాలకు అడ్డుగా ప్యాడ్‌లను కట్టాలని చెబుతున్నారు. కారును కవర్‌తో కప్పడం బెస్టని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు టైర్లు, బ్యాటరీలను చెక్ చేసుకోవడం మంచిదని అంటున్నారు. బ్యాటరీ, ఇంధన ట్యాంకులు కూడా సరిచూసుకోవాలని చెప్పారు. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా కారులో మంటలు వ్యాపించే ప్రమాదం కూడా ఉంది. ఎలక్ట్రిక్ పరికాలను నాసిరకానికి ఉపయోగించడం వల్ల షార్ట్ సర్క్యూట్(Short Circuit) అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.