వనమా వెంకటేశ్వరరావుపై 2019లో హై కోర్టులో పిటీషన్ వేసినట్లు జలగం వెంకట్రావు తెలిపారు. వాదనలు విన్న కోర్టు తీర్పు ఇచ్చిందని.. నన్ను ఎమ్మెల్యేగా పరిగణించిందని వెల్లడించారు. వనమా వెంకటేశ్వర రావును ఎమ్మెల్యే పదవి నుంచి కోర్టు డిస్ క్వాలిఫై చేసిందని వివరించారు. నాది నైతిక విజయమని జలగం వెంకట్రావు పేర్కొన్నారు. తీర్పును అమలు చేయాలని సెక్రటరీని కలిశానని తెలిపారు. స్పీకర్ తో ఫోన్ లో మాట్లాడినట్లు వెల్లడించారు. 2018 ఎన్నికల్లో కుతంత్రాలు అన్ని చూశానని అన్నారు.
వనమా వెంకటేశ్వరరావుపై 2019లో హై కోర్టులో పిటీషన్ వేసినట్లు జలగం వెంకట్రావు తెలిపారు. వాదనలు విన్న కోర్టు తీర్పు ఇచ్చిందని.. నన్ను ఎమ్మెల్యేగా పరిగణించిందని వెల్లడించారు. వనమా వెంకటేశ్వర రావును ఎమ్మెల్యే పదవి నుంచి కోర్టు డిస్ క్వాలిఫై చేసిందని వివరించారు. నాది నైతిక విజయమని జలగం వెంకట్రావు పేర్కొన్నారు. తీర్పును అమలు చేయాలని సెక్రటరీని కలిశానని తెలిపారు. స్పీకర్ తో ఫోన్ లో మాట్లాడినట్లు వెల్లడించారు. 2018 ఎన్నికల్లో కుతంత్రాలు అన్ని చూశానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చానని.. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని స్పష్టం చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని కూడా కలుస్తానని జలగం వెంకట్రావు వెల్లడించారు. ఎమ్మెల్యేగా మూడు నెలల్లో కొత్తగూడెంకు ఏం చేయాలో నాకు ఎజెండా ఉందని వెంకట్రావు తెలిపారు.
తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పును వెల్లడించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు చెప్పింది. ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 2018 ఎన్నికలలో తనపై గెలిచిన వనమా వెంకటేశ్వరరావు గెలుపును సవాలు చేస్తూ జలగం వెంకట్రావు 2018లో హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్ లో వనమా వెంకటేశ్వరరావు తప్పుడు వివరాలు ఇచ్చారంటూ జలగం వెంకట్రావు తన పిటీషన్‌లో పేర్కొన్నారు. జలగం వెంకట్రావు పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. సుదీర్ఘంగా విచారించిన తదుపరి వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. రెండవ స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును విజేతగా ప్రకటించింది.