పైన నోటీసును చూశారుగా! జూబ్లీ హిల్స్‌లోని(Jubilee Hills) వైకుంఠ మహాప్రస్థానం(Vaikuntha Mahaprasthanam) ఇచ్చిన నోటీసు అది! సారాంశమేమిటో అర్థమయ్యే ఉంటుంది. మహాప్రస్థానంలో మామూలు వాళ్లకు అంత్యక్రియలు జరగవు. వీఐపీలు, సెలబ్రిటీల అంత్యక్రియలు అక్కడే జరుగుతాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందినవారివి! మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు జరగడం అనేది ఇప్పుడో స్టేటస్‌ సింబల్‌గా మారింది.తమ తల్లిదండ్రులదో,అత్తమామలదో అంత్యక్రియలను గొప్పగా చేసేస్తున్నవారు అస్థికలను మాత్రం తీసుకువెళ్లడం లేదట! మామూలు స్మశానాల్లో ఇలా ఉండదు.

పైన నోటీసును చూశారుగా! జూబ్లీ హిల్స్‌లోని(Jubilee Hills) వైకుంఠ మహాప్రస్థానం(Vaikuntha Mahaprasthanam) ఇచ్చిన నోటీసు అది! సారాంశమేమిటో అర్థమయ్యే ఉంటుంది. మహాప్రస్థానంలో మామూలు వాళ్లకు అంత్యక్రియలు జరగవు. వీఐపీలు, సెలబ్రిటీల అంత్యక్రియలు అక్కడే జరుగుతాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందినవారివి! మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు జరగడం అనేది ఇప్పుడో స్టేటస్‌ సింబల్‌గా మారింది.తమ తల్లిదండ్రులదో,అత్తమామలదో అంత్యక్రియలను గొప్పగా చేసేస్తున్నవారు అస్థికలను మాత్రం తీసుకువెళ్లడం లేదట! మామూలు స్మశానాల్లో ఇలా ఉండదు. అంటే మధ్య తరగతివారి వైకుంఠధామంలో(Vaikunthadhama) ఇలా అస్థికలను(Remains) వదిలేసి ఎవరూ వెళ్లరు. మహాప్రస్థానంలో మాత్రమే ఎందుకు జరుగుతుంది? పిల్లలు వాటిని ఎందుకు వదిలించుకుంటున్నారు? అసలు అంత్యక్రియల(funeral) తర్వాత ఆటువైపే వెళ్లడం లేదనే నిష్టూరంగా అనిపించవచ్చుకానీ అది నిజం!తమ పెద్దలను గౌరవంగా ఇహలోకానికి పంపించాలన్న సోయి కొరవడిందనిపిస్తోంది. మహాప్రస్థానం నిర్వాహకులు మాత్రం ఎంతకాలమని అస్థికలను భద్రపరుస్తారు? పేరుకుపోతున్న అస్థికల కుండలను చూసి నిర్వాహకులకే కోపం వచ్చేసింది. అందుకే ఈ నోటీసును జారీ చేశారు. సెప్టెంబర్‌ 30 వరకు ఎవరైనా అస్థికలను తీసుకువెళ్లరో అలాంటివాటిని అనాథ అస్థికలుగా పరిగణించి అక్టోబర్‌ 14వ తేదీన తామే నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఈ విషయంలో తమను నిందించి ప్రయోజనం ఉండదని గట్టిగా చెప్పారు. ధనవంతులుండే జూబ్లీహిల్స్‌లో పెద్దలకు ఇంత గొప్పగా గౌరవమర్యాదలు దక్కుతున్నాయన్నమాట!

Updated On 22 Sep 2023 5:00 AM GMT
Ehatv

Ehatv

Next Story