భువనగిరి రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులు ఆరుగురుపై కేసులు పెట్టారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్టర్లు భువనగిరి దగ్గర భూములు కొన్నారని అన్నారు. గతంలో మిర్చి రైతులకు సంకెళ్లు వేసిన ఘనత కేసీఆర్ ది.. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డునిర్వాసితులకు సంకెళ్లు వేశారని ఫైర్ అయ్యారు.
భువనగిరి(Bhuvanagiri) రీజనల్ రింగ్ రోడ్డు(Regional Ring Road) భూ నిర్వాసితులు ఆరుగురుపై కేసులు పెట్టారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు(V Hanumantharao) ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్టర్లు(Realtors) భువనగిరి దగ్గర భూములు కొన్నారని అన్నారు. గతంలో మిర్చి రైతులకు సంకెళ్లు వేసిన ఘనత కేసీఆర్ ది.. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డునిర్వాసితులకు సంకెళ్లు వేశారని ఫైర్ అయ్యారు. రియల్టర్ల దగ్గర డబ్బులు తీసుకొని భువనగిరి రైతుల(Farmers)కి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల దగ్గర ఏకే-47 గన్స్(AK47 Guns) ఉన్నాయా చెప్పండని ప్రశ్నించారు. అన్నం పెట్టె రైతులకే సంకెళ్లు వేస్తారా.. వారిపై నాన్ బెయిల్ కేసులు(Non Bailable Cases) పెడతారా..? అంటూ మీడియాముఖంగా నిలదీశారు. అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేసే ఏకైక ప్రభుత్వం కేసీఆర్(KCR) ప్రభుత్వమని ధ్వజమెత్తారు. రియల్టర్లతో బీఆర్ఎస్ నేతలు కుమ్మక్కై.. కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. భువనగిరి రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ(Congress) పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు.