కొందరు విమోచనం, ఇంకొందరు విలీనం అంటున్నారని జాతీయ సమైక్యతా దినోత్సవంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు(V Hanumatha Rao) కామెంట్ చేశారు. గాంధీ భవన్‌లో(Gandhi Bhavan) ఆయన మాట్లాడుతూ.. విజయభేరి సభ కోసం బ్యానర్లు కట్టుకుంటే ఐదు వేలు, పది వేలు జరిమానాలు వేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలకు 2 లక్షల 95 వేల జరిమానాలు వేసారని..

V.Hanumanth Rao
కొందరు విమోచనం, ఇంకొందరు విలీనం అంటున్నారని జాతీయ సమైక్యతా దినోత్సవంపై కాంగ్రెస్(Congress) సీనియర్ నేత వీ హనుమంతరావు(V Hanumatha Rao) కామెంట్ చేశారు. గాంధీ భవన్‌లో(Gandhi Bhavan) ఆయన మాట్లాడుతూ.. విజయభేరి సభ కోసం బ్యానర్లు కట్టుకుంటే ఐదు వేలు, పది వేలు జరిమానాలు వేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలకు 2 లక్షల 95 వేల జరిమానాలు వేసారని.. మున్సిపాలిటీల్లో డబ్బులు లేవా..? అని నిప్పులు చెరిగారు. నాంపల్లి దర్గా దగ్గర కూర్చొని అడగండి.. మేమే డబ్బులు వేస్తామని ఎద్దేవా చేశారు.
మంత్రుల బర్త్ డేలకు, బీఆర్ఎస్(BRS) సభలకు పెద్ద పెద్ద కటౌట్లు కడితే ఎందుకు ఫైన్ వేయరు ?? అని ప్రశ్నించారు. నిజాం సరెండర్ అయిన రోజు ప్రజల మీద జరిమానాలు వేసుడు ఏందీ అని నిలదీశారు. చలాన్ లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో రద్దు చేయకుంటే.. మున్సిపల్ కార్పోరేషన్ ముందు ధర్న చేస్తామని అల్టిమేటం జారీచేశారు. జైలుకు అయినా వెళ్తాం కానీ.. చలాన్ లు కట్టేది లేదని అన్నారు. చలాన్ లు అడగడానికి వస్తే తిరగబడండని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు.
