రాహుల్ గాంధీ(Rahul Gandhi) భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నారని మాజీ పీసీసీ అధ్య‌క్షుడు వీ హనుమంతరావు(V. Hanumantha) అన్నారు. ఆయ‌న సోమ‌వారం గాంధీ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీసీ జనగణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని.. బీసీ చాంపియన్స్ మేము అని మోదీ, కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ(Rahul Gandhi) భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నారని మాజీ పీసీసీ అధ్య‌క్షుడు వీ హనుమంతరావు(V. Hanumantha) అన్నారు. ఆయ‌న సోమ‌వారం గాంధీ భ‌వ‌న్‌(Gandhi Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ.. బీసీ జనగణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని.. బీసీ చాంపియన్స్ మేము అని మోదీ(PM Modi), కేసీఆర్(KCR) గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీసీ జనాభా ప్రకారం చట్టసభల్లో 50 శాతం స్థానాలు కేటాయించాలన్నారు. బీసీల కోసం ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేన‌ని అని స్ప‌ష్టం చేశారు. నేడు బీసీ పిల్లలు ఉన్నత చదువులు చదవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమ‌న్నారు.

త్వరలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ గర్జన నిర్వహిస్తామ‌ని తెలిపారు. రాహుల్ గాంధీ, సిద్ధ‌రామయ్యలను స‌భ‌కు ఆహ్వానిస్తామన్నారు. రాజీవ్ గాంధీ 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించారని తెలిపారు. బీసీ గర్జన ద్వారా బీసీ కులాలకు ఏం చేయాలనే దానిపై చర్చిస్తామని తెలిపారు.

ముస్లీంలు అంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. అమిత్ షా ముస్లీం రిజర్వేషన్లు ఎత్తి వేస్తామంటే కేసీఆర్, కుమారస్వామి మాట్లాడలేదని గుర్తుచేశారు. బీసీలకు న్యాయం జరగాలి.. పార్టీలో బీసీలకు టిక్కెట్లు ఇవ్వాలని అధిష్టానంతో మాట్లాడతాన‌ని వెల్ల‌డించారు. బీసీ గర్జన సభలో బీసీ డిక్లరేషన్ విడుదల చేస్తామని తెలిపారు. రాహుల్ గాంధీ కులజనగణన చేపడతామని హామీ ఇవ్వగానే.. అన్ని రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చిందని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు కాంగ్రెస్ పార్టీ వైపుకు వస్తారని అన్నారు. బీసీ క్రిమిలేయర్ ఎత్తివేయమంటే ఎత్తివేయలేదని.. బీసీలకు మోదీ, కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ రిమోట్ కంట్రోల్ నాగ్‌పూర్ లో వుందని వ్యాఖ్యానించారు.
[1:53 pm, 17/07/2023] +91 98858 11233: ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా టీఎస్ఆర్టీసీ 'పల్లె వెలుగు టౌన్ బస్ పాస్'

ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్”కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్ ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది.

ఈ టౌన్‌ పాస్ తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్ నగర్ లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండలో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500గా 'పల్లె వెలుగు టౌన్ బస్ పాస్' ధరను సంస్థ ఖరారు చేసింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్ లో జనరల్ బస్ పాస్ అందుబాటులో ఉంది. ఆ బస్ పాస్ ను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు.. కొత్తగా 'పల్లెవెలుగు టౌన్ బస్ పాస్'ను సంస్థ తెచ్చింది.

హైదరాబాద్‌ లోని బస్‌ భవన్‌లో సోమవారం 'పల్లె వెలుగు టౌన్‌ బస్‌ పాస్‌' పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ ఆవిష్కరించారు. ఈ కొత్త టౌన్ పాస్ ఈ నెల 18 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.

జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారి ఆర్థిక భారం తగ్గించేందుకు 'పల్లె వెలుగు టౌన్ బస్ పాస్' ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఈ పాస్ ను అమలు చేస్తున్నాం. ప్రయాణికుల ఫీడ్ బ్యాక్ ను బట్టి మరిన్ని ప్రాంతాలకు పల్లె వెలుగు టౌన్ బస్ పాస్ ను విస్తరిస్తాం. వాస్తవానికి 10 కిలోమీటర్ల పరిధికి రూ.1200, 5 కిలోమీటర్ల పరిధికి రూ.800 ధర ఉండగా.. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించాలని ఆ బస్ పాస్ లకు సంస్థ రాయితీ కల్పించింది. 10 కిలోమీటర్ల పరిధికి రూ.800, 5 కిలో మీటర్ల పరిధికి రూ.500గా పాస్ ధరను నిర్ణయించింది. కొత్తగా తీసుకువచ్చిన ఈ పాస్ ను హైదరాబాద్, వరంగల్ లో మాదిరిగానే ప్రయాణికులు ఆదరించి.. సంస్థను ప్రోత్సహించాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు.

Updated On 17 July 2023 5:09 AM GMT
Ehatv

Ehatv

Next Story