రాహుల్ గాంధీలో(Rahul Gandhi) గొప్ప మార్పు కనిపిస్తుందని కాంగ్రెస్(Congress) సీనియర్ నాయుకుడు వీ హనుమంతరావు(V.Hanumanth Rao) అన్నారు. లారీలో ప్రయాణించి వారి సాధక బాధకాలు తెలుసుకున్నారని.. 9 ఏళ్ళ బీజేపీ పాలనలో ఉన్న సమస్యలపై రాహుల్ గొంతెత్తి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీలో(Rahul Gandhi) గొప్ప మార్పు కనిపిస్తుందని కాంగ్రెస్(Congress) సీనియర్ నాయుకుడు వీ హనుమంతరావు(V.Hanumanth Rao) అన్నారు. లారీలో ప్రయాణించి వారి సాధక బాధకాలు తెలుసుకున్నారని.. 9 ఏళ్ళ బీజేపీ పాలనలో ఉన్న సమస్యలపై రాహుల్ గొంతెత్తి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే మోదీ కనీసం.. బీసీ శాఖను ఏర్పాటు చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. కుల గణణ చేయడానికి బీజేపీ భయపడుతుంది. కానీ మేము అధికారంలోకి రాగానే జనగణన చేపడుతామని రాహుల్ చెప్తున్నారని అన్నారు.
బీఆర్ఎస్(BRS) ఎందుకు కుల గణణ గురించి మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగుల జీతాలకు డబ్బులు లేవు కానీ.. బీసీ బంధు ఇస్తాడనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉత్సవాల పేరుతో పార్టీ ప్రయోజనం కోసం.. ప్రభుత్వ డబ్బును కేసీఆర్(KCR) ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీగర్జనకు రావాలని సిద్దారామయ్య ను ఆహ్వానిస్తామన్నారు. మైనారిటీలు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. కర్ణాటకలో బీజేపీ.. మైనారిటీ రిజర్వేషన్లు ఎత్తేస్తామంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఈ విషయమై అసదుద్దీన్ ఎందుకు ప్రశ్నించలేదు.. కేసీఆర్, అసదుద్దీన్, మోదీ ఒక్కటేనని వీహెచ్ అన్నారు.