మోదీ, కేసీఆర్ లు నిరుద్యోగ సమస్య పరిష్కారంలో విఫలం అయ్యారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam kummar reddy) అన్నారు. శ‌నివారం గాంధీభవన్(Gandhi Bhavan) లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

మోదీ, కేసీఆర్ లు నిరుద్యోగ సమస్య పరిష్కారంలో విఫలం అయ్యారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam kummar reddy) అన్నారు. శ‌నివారం గాంధీభవన్(Gandhi Bhavan) లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో యువత తెలంగాణ కోసం పోరాటం చేశారని.. కానీ రాష్ట్రం వచ్చిన తరువాత నిరుద్యోగ సమస్య మరింత పెరిగిందని అన్నారు. గతంలో 25 లక్షలు నిరుద్యోగులు ఉంటే.. ఇప్పుడు 40 లక్షలకు చేరిందన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్(KCR).. ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేదని దుయ్య‌బ‌ట్టారు.

ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) నిరుద్యోగులకు అండగా ఉండడానికి వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అక్టోబర్ లో ఎన్నికల షెడ్యూల్ వస్తే నవంబర్ లో ఎన్నికలు జరుగుతాయన్నారు. 80 వేల 39 పోస్టులు భర్తీ చేస్తానని, 11 వేల కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారు.. కానీ ఈ ఏడాదిలో ఒక్కటి కూడా చెయ్యలేదని అన్నారు. కేసీఆర్(KCR) అసమర్థత, అవినీతి వల్లే పేపర్ లీకేజీ అయ్యింద‌ని అన్నారు. పేపర్ లీక్ పై ఇప్పటి వరకు కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. 503 గ్రూప్ -1 పోస్టులకు మూడున్నర లక్షల మంది అప్లై చేసుకున్నారు. 17 వేల పోలీస్ ఉద్యోగాలకు 12 లక్షల మంది అప్లై చేసుకున్నారంటే తీవ్రత ఎలా ఉందో అర్ధం అవుతుంద‌ని అన్నారు.

ప్రభుత్వ యూనివర్సీటీలో కనీస వసతులు సిబ్బంది లేరు. అనుచరులకు ప్రైవేట్ యూనివర్సిటీల అనుమతి ఇవ్వడం తప్పా చేసిందినేమీ లేదని విమ‌ర్శించారు. తెలంగాణ యూనివర్సిటీలో ఒక్క పోస్ట్ కూడా భర్తీ చెయ్యలేదు. కేసీఆర్ నిర్లక్ష్యానికి ఇదే ఉదాహ‌ర‌ణ‌. మోదీ కూడా సేమ్ ఇదే ఫాలో అవుతున్నార‌ని అన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ అన్నారు. 7 ఏళ్ల కాలంలో 18 కోట్ల ఉద్యోగాల భర్తీ చెయ్యాలి. కానీ మోదీ చేసిన పనులకు చాలా మంది ఉపాధి కోల్పోయారని అన్నారు.

Updated On 6 May 2023 3:38 AM GMT
Ehatv

Ehatv

Next Story