యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ షేర్లు సోమవారం నాడు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)కి తన బీర్ సరఫరాను తిరిగి ప్రారంభిస్తాయని

యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ షేర్లు సోమవారం నాడు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)కి తన బీర్ సరఫరాను తిరిగి ప్రారంభిస్తాయని ప్రకటించిన వెంటనే కంపెనీ షేర్‌ ఐదుశాతం పెరగడం విశేషం. తాము TGBCLతో చర్చలు జరుపుతున్నామని, ఇవి నిర్మాణాత్మక చర్చలుగా ఉన్నాయని అని యునైటెడ్ బ్రూవరీస్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. TGBCL కంపెనీకి ధర, బకాయి చెల్లింపులపై తమ సమస్యలను సమయానుకూలంగా పరిష్కరించేందుకు హామీ ఇచ్చిందని తెలిపింది. టీజీబీసీఎల్ ఇచ్చిన హామీల ఆధారంగా ప్రస్తుతానికి సరఫరాలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. "వినియోగదారులు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా ఇది మధ్యంతర నిర్ణయం" అని యునైటెడ్ బ్రూవరీస్ తెలిపింది.కింగ్‌ఫిషర్ బీర్ తయారీదారు యునైటెడ్ బ్రూవరీస్, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు తన బీర్ సరఫరాను పునరుద్ధారించాలని నిర్ణయం తీసుకున్నారు.

ehatv

ehatv

Next Story