Telangana Elections 2023 : వీరభోగ వసంతరాయలు గుర్రమెక్కారు..ఓట్లు అడిగారు
ఎన్నికల వేళ చాలా విచిత్రాలను చూడాల్సి వస్తుంటుంది. వింత పోకడలతో జరిగే అభ్యర్థుల ప్రచారం సహజంగానే ఆసక్తిని కలిగిస్తుంటుంది. ఎల్బీనగర్ నియోజకవర్గం(LB Nagar Constituency) నుంచి స్వతంత్ర అభ్యర్థి(Independent candidate)గా పోటీ చేస్తున్న డాక్టర్ వీరభోగ వసంతరాయులు(Veera Bhoga Vasantha Rayalu) కూడా ఇలాగే అందరి దృష్టిని ఆకర్షించేవిధంగా వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.

Telangana Elections 2023
ఎన్నికల వేళ చాలా విచిత్రాలను చూడాల్సి వస్తుంటుంది. వింత పోకడలతో జరిగే అభ్యర్థుల ప్రచారం సహజంగానే ఆసక్తిని కలిగిస్తుంటుంది. ఎల్బీనగర్ నియోజకవర్గం(LB Nagar Constituency) నుంచి స్వతంత్ర అభ్యర్థి(Independent candidate)గా పోటీ చేస్తున్న డాక్టర్ వీరభోగ వసంతరాయులు(Veera Bhoga Vasantha Rayalu) కూడా ఇలాగే అందరి దృష్టిని ఆకర్షించేవిధంగా వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. శాలివాహనరాజు వేషధారణలో గుర్రంపై ఎల్బీ నగర్ లో ఉన్న శ్రీకాంత్‌చారి విగ్రహం దగ్గర నుంచి ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారం దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయం వరకు సాగింది. ఎల్బీనగర్ ప్రజల్లో చైతన్యం పాలు ఎక్కువగా ఉంటుందని, ఈసారి తనలాంటి ఉన్నత విద్యావంతుడికి, బీసీ అభ్యర్థికి పట్టం కడతారని అనిపిస్తోందని వీరభోగ వసంతరాయులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో బహుజనులకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 2018లో కూడా ఈయన ఎల్బీనగర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
