శ‌నివారం ఉద‌యం సికింద్రాబాద్ క‌ళాసిగూడ మ్యాన్‌హోల్‌లో ప‌డి చిన్నారి మౌనిక మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర‌మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. చిన్నారి మౌనిక మృతి బాధాకరమ‌న్నారు. రోడ్డును తవ్వేసి.. డ్రైనేజి పైప్ లైన్ వేయాల్సి వస్తుంది కాబట్టి పనులు ఆపారని తెలిపారు. ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం వల్ల ప్రాణం పోయిందన్నారు. పరిహారం ఇచ్చి తప్పించుకోనే ప్రయత్నం కాంట్రాక్టర్లు చేస్తున్నార‌ని అన్నారు. కాంట్రాక్టర్లకు చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోవడం వల్లే పనులు అగుతున్నాయన్నారు.

వేల రూపాయలు ఇస్తున్నాం.. హైవేలు కడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం.. స్థానికంగా వీటిపై దృష్టి సారించడం లేదని అన్నారు. వాటర్ పైప్ లైన్ కోసం తవ్వి విడిచిపెడుతున్నారు.. బస్తీలల్లో బాధలను ఎవ్వరు పట్టించుకోవడంలేదని ఫైర్ అయ్యారు. జీతాలు ఇవ్వలేని, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానిద‌ని విమ‌ర్శించారు. బీఆర్ఎస్ వాళ్ళు భూముల కబ్జాల మీద బిజీగా వున్నారు.. ప్రజలను పట్టించుకువడం లేదని ఆరోపించారు.

మ్యాన్ హోల్ నాళాలు పైకప్పు లేని ప్రాంతాలను, డేంజర్ గా ఉన్న ప్రాంతాలను గుర్తించి వర్ష కాలం దగ్గర పడుతుంది కాబట్టి త్వరితగతిన పనులు చెయ్యాలని కోరారు. మౌనిక చిన్నారి మృతికి ప్రభుత్వం నిర్లక్ష్యం కార‌ణ‌మ‌న్నారు. కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, జీహెచ్ఎంసీదేనని అన్నారు. హైదరాబాద్ లో కోటికిపైగా జనాభా వున్నారు. జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ బోర్డుల్లో నిధుల కొరత వేధిస్తోందన్నారు. అసలు నిధులు ఎటు పోతున్నాయి..? అని ప్ర‌శ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. మా పార్టీ తరుపున కూడా బాధితులకు అండగా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.

Updated On 29 April 2023 4:00 AM GMT
Ehatv

Ehatv

Next Story