కామారెడ్డి(Kamareddy) జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణం జరిగింది. ఓ దళితురాలిని వివస్త్రను చేసి కారం చల్లి చితికబాదిన సంఘటన మూడు రోజుల కిందట జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాచారెడ్డి(Machareddy) మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కామారెడ్డి(Kamareddy) జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణం జరిగింది. ఓ దళితురాలిని వివస్త్రను చేసి కారం చల్లి చితికబాదిన సంఘటన మూడు రోజుల కిందట జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాచారెడ్డి(Machareddy) మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో కొందరు ఓ దళిత మహిళను వివస్త్రను చేసి జననాంగాల్లో కారం చల్లి చిత్రహింసలకు గురి చేశారు. అందరూ చూస్తుండగానే నడిబజారులో చెట్టుకు కట్టేసి కొట్టారు. ప్రజలు చోద్యం చూస్తూ ఉన్నారే కానీ ఆపే ప్రయత్నం చేయకపోవడం అత్యంత విషాదం. రామారెడ్డి మండలానికి వలస వచ్చి బతుకుతున్న జంటపై తొలుత దాడి చేశారు. ఇక్కడ నుంచి మాచారెడ్డి మండలంలోని మరో గ్రామానికి ఆ జంటను తీసుకెళ్లి అక్కడే చెట్టుకు కట్టేసి కొట్టారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆ జంటను మరుసటిరోజు కొందరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఈ దారుణంపై పోలీసులు నోరు మెదపకపోవడం దారుణం. ఈ ఘటన బాహ్య ప్రపంచానికి తెలిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే కారణంతో పోలీసులు కేసు నమోదు చేయడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు.

Updated On 9 Feb 2024 1:12 AM GMT
Ehatv

Ehatv

Next Story