శ్రీశైలం(srisailam) మహాక్షేత్రంలో ఉగాది(Ugadi) మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. రెండవరోజు కైలాసవాహనంపై స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం విద్యత్ కాంతులలో మెరుస్తోంది.
శ్రీశైలం(srisailam) మహాక్షేత్రంలో ఉగాది(Ugadi) మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. రెండవరోజు కైలాసవాహనంపై స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం విద్యత్ కాంతులలో మెరుస్తోంది. ఉగాది మహోత్సవాలలో రెండవరోజు శ్రీశైల భ్రమరాంబరాదేవి మహాదుర్గ అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో కైలాసవాహనంపై ఉన్న స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు గ్రామోత్సవానికి బయలుదేరాయి. ఈ సందర్భంగా ఉత్సవమూర్తుల ముందు గొరవయ్యల నృత్యాలు, కన్నడిగుల ఆటపాటలు, పులిబొమ్మల వేషాలు, కోలాటాలు డప్పు చప్పుడ్లు బ్యాండ్ వాయిద్యాలు మంత్ర ముగ్దులను చేశాయి.