వివాహేతర సంబంధాలు(Extra Marital Affair) చక్కటి కాపురంలో చిచ్చు పెడుతున్నాయి. వివాహేతర సంబంధాల వల్ల భర్త(Husband) లేదా భార్యను హత్య చేయడంతో వారి పిల్లలు అనాథలుగా(Orphans) మారుతున్నారు. ఈ వివాహేతర సంబంధాల మోజులో పడి తమ జీవిత భాగస్వామిని చంపడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం.

వివాహేతర సంబంధాలు(Extra Marital Affair) చక్కటి కాపురంలో చిచ్చు పెడుతున్నాయి. వివాహేతర సంబంధాల వల్ల భర్త(Husband) లేదా భార్యను హత్య చేయడంతో వారి పిల్లలు అనాథలుగా(Orphans) మారుతున్నారు. ఈ వివాహేతర సంబంధాల మోజులో పడి తమ జీవిత భాగస్వామిని చంపడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఇలాంటి ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలోని సిద్దిపేట(Siddipet) జిల్లాలో మరో హత్య(Murder) జరిగింది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చింది భార్య.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లాలో రామేశ్వరంపల్లికి చెందిన మైలి నవీన్ కుమార్(Maili Naveen Kummar), అతని భార్య ఉదయరాణి(Udaya Rani) కూలి పనులు చేసుకుంటూ జీవితం గడుపుతున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నాడు. వీరి ఇద్దరు కూతుర్లు మెదక్(Medak) జిల్లాలోని అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు. నవీన్ కుమార్ ఇంటి పక్కనే ఉంటున్న తరుణ్(Tharun) అనే యువకుడితో భార్య ఉదయరాణికి పరిచయం ఏర్పడింది. గత కొంత కాలంగా చనువుగా ఉంటుంది. ఈ చనువు కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఏదో ఒక రోజు ఈ విషయం బయట పడడం, భర్తకూ తెలియడంతో కొంత కాలంగా నవీన్‌, ఉదయరాణి ఘర్షణ పడుతూ వచ్చారు. రానురాను ఈ గొడవలు ముదిరాయి. ఇక తనతో సుఖం కావాలంటే భర్తను అడ్డు తొలగించాలని ప్రియుడిని కోరింది. నవీన్‌ను చంపాలని ప్రణాళిక రచించారు. మద్యం తాగుదామని నవీన్‌ను ప్రియుడు తరుణ్‌ బయటకు తీసుకెళ్లాడు. నవీన్‌కు ఎక్కువగా మద్యం తాగించిన తర్వాత, తరుణ్ అతనిని ఇంటికి తీసుకొస్తుండగా మార్గ మధ్యలో నవీన్ కింద పడ్డాడంతో గాయాలయ్యాయి. అలానే ఇంటికి తీసుకొచ్చి సంపులో ముంచి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. నవీన్ కింద పడి తలకు గాయం కావడంతో మృతి చెందాడని ఉదయరాణి సమాచారం అందించింది. నవీన్‌ తల్లి, అన్నలు అక్కడికి చేరుకున్నారు. నవీన్ తలకు, మెడపై గాయాలు గమనించారు. ఈ విషయంపై ఉదయరాణిని గట్టిగా ప్రశ్నించారు. దీంతో ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు ఒప్పుకుంది.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉదయారాణి, తరుణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated On 16 Nov 2023 3:04 AM GMT
Ehatv

Ehatv

Next Story