నిర్మల్ జిల్లా మోరపల్లిలో టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సుకు తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. 170 మంది ప్ర‌యాణికుల‌తో నిర్మల్ బస్ డిపో నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న బ‌స్సు టైర్లు ఊడిపోయాయి

నిర్మల్ జిల్లా మోరపల్లిలో టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సుకు తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. 170 మంది ప్ర‌యాణికుల‌తో నిర్మల్ బస్ డిపో నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న బ‌స్సు టైర్లు ఊడిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవ‌లేదు. ఈ ఘటన తర్వాత ప్రయాణికులు, ప్రధానంగా మహిళలు రోడ్డుపై ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. “అమాయక పౌరుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు” అని ప్రశ్నించారు. 50 మంది ప్రయాణించాల్సిన బస్సులో 170 మంది ఎక్కారు. నిర్మల్ డిపోకు చెందిన‌ బస్సులో 170 మంది ప్రయాణిస్తుండ‌టంతో మోరపెల్లి వద్ద రెండు టైర్లు ఊడిపోయాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడం నిజంగా అదృష్టమే. ప్రభుత్వానికి నా ప్రశ్న ఏమిటంటే.. మీరు అమాయక పౌరుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు.? బస్సుల సంఖ్యను ఎప్పుడు పెంచాలనుకుంటున్నారు? ప్రయాణీకుల సంఖ్యను పరిమితం చేసే విషయంలో ఏదైనా భద్రతా ప్రోటోకాల్ అనుసరించబడుతుందా? అధిక పని చేసే డ్రైవర్లు, కండక్టర్లకు మీరు ఏం పరిహారం చెల్లిస్తున్నారు? ఆయ‌న‌ X ద్వారా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story