ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నాయి. చాలా హాస్టళ్లలో (Hostel)కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు.

Snake Bite:గురుకుల హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థులకు పాముకాటు, పరిస్థితి విషమం

ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నాయి. చాలా హాస్టళ్లలో (Hostel)కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. నాణ్యమైన భోజనం పెట్టకుండా విద్యార్థులను (students)పస్తులు ఉంచుతున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించలేక ప్రభుత్వాలు చేతులెత్తయడంతో విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. తాజాగా ఓ గురుకుల హాస్టల్‌లో(Gurukul Hostel) ఏకంగా పాము కాటు(snake bite) కర్చి ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా మారింది.

జగిత్యాల (Jagtial)జిల్లా పెద్దాపూర్(peddapur) గురుకుల స్కూల్ హాస్టల్లో పడుకున్న ఇద్దరు విద్యార్థులు పాముకాటుకు గురయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మరో ఆస్పత్రికి తరలించారు. అయితే అదే గదిలో పడుకున్న మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి ఈ ఘటన రావడంతో విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మెట్‌పల్లికి (metpalli)చెందిన 14 ఏళ్ల హర్షవర్ధన్(harshvardhan), ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) ఫకీర్‌ కొండాపూర్‌(Fakir Kondapur) గ్రామానికి చెందిన ఆడేపు గణేష్‌ (Aadepu Ganesh)పెద్దాపూర్‌ గురుకుల స్కూల్‌లో 8వ తరగతి (8thclass)చదువుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి హాస్టల్‌ గదిలో నిద్రిస్తుండగా విద్యార్థుల చేతుల మీదుగా ఏదో పాకినట్లు అనిపించింది. కానీ విద్యార్థులు ఏదో పురుగు పారిందనే భ్రమలో ఉండి అలాగే పడుకునిపోయారు. కానీ తెల్లవారుజామున 4 గంటలకు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తోటి విద్యార్థులు కేర్‌టేకర్‌కు సమాచారం అందించారు. కేర్‌ టేకర్‌ (caretekar)వచ్చి విద్యార్థులకు నీరు, ఆహారం తినిపించాలని ప్రయత్నించినా కుదరలేదు.

ఇక ప్రయోజనం లేదనుకొని ఉ.6 గంటలకు మెట్‌పల్లి సివిల్‌ ఆస్పత్రికి(civil hospital)తరలించారు. విద్యార్థుల చేతులపై ఉన్న గాట్లు చూసిన వైద్యులు పాముకాట్లుగా గుర్తించారు. పరిస్థితి విషమించడంతో ఇద్దరు విద్యార్థులను మరో ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తల్లిదండ్రులు చెప్తున్నారు. పాముకాటుకు గురికావడం, సకాలంలో స్పందించలేదని, కనీసం తమకు సమాచారం కూడా ఇయ్యలేదని కేర్‌టేకర్, ప్రిన్సిపాల్‌పై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే తమ పిల్లల ప్రాణాల మీదకు వచ్చిందని ఆరోపిస్తున్నారు. అయితే ఇదే గదిలో నిద్రిస్తున్న మరో విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పాముకాటుతోనే ఇతడు కూడా చనిపోయాడా లేదా ఇతరత్రా కారణాలేవైనా ఉన్నాయన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

ehatv

ehatv

Next Story