మహబూబాబాద్(Mahbubabad) జిల్లా కొత్తగూడ ఏజెన్సీలోని ఓ గిరిజన గూడేనికి చెందిన ఇద్దరు వివాహిత మహిళలు(Married Women) గ్రామం నుంచి పారిపోయారు. వారిద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేరని, సహజీవనం కోసమే పారిపోయారని గ్రామస్తులు అంటున్నారు. వారిలో ఒక మహిళకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో మహిళకు భర్త, కొడుకు ఉండగా, ఇటీవల అనారోగ్యంతో కొడుకు చనిపోయాడు.
మహబూబాబాద్(Mahbubabad) జిల్లా కొత్తగూడ ఏజెన్సీలోని ఓ గిరిజన గూడేనికి చెందిన ఇద్దరు వివాహిత మహిళలు(Married Women) గ్రామం నుంచి పారిపోయారు. వారిద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేరని, సహజీవనం కోసమే పారిపోయారని గ్రామస్తులు అంటున్నారు. వారిలో ఒక మహిళకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో మహిళకు భర్త, కొడుకు ఉండగా, ఇటీవల అనారోగ్యంతో కొడుకు చనిపోయాడు. వీరిద్దరూ ఆరునెలల కిందట గ్రామం నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల ప్రాంతంలో రహస్యంగా జీవిస్తున్నారు. ఒకరు పురుషుడిలా, మరొకరు మహిళలా ఉంటూ కాపురం చేస్తున్నారట! ఆ ఇద్దరు మహిళలలో ఒకరి భర్త భార్య కోసం వెతుకుతూనే ఉన్నాడు. తన భార్య గుండాల మండలంలో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. అయిదు రోజుల కిందట వారిద్దరిని గ్రామానికి తీసుకొచ్చాడు. స్థానికుల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. పెద్దమనుషులు ఎంత చెబుతున్నా వీరు మాత్రం ససేమిరా అంటున్నారు. తమకు నచ్చిన విధంగా ఉంటామని, తమను బలవంతపెట్టవద్దని వారు కరాఖండిగా చెప్పేశారట! గ్రామ పెద్దలకు ఏం చేయాలో తెలియడం లేదు. ప్రస్తుతానికి ఆ ఇద్దరు మహిళలు అదే గ్రామంలోని తమ తల్లిగారి ఇండ్లలో ఉన్నారు.