అప్పుల(debts) భారంతో మరో ఇద్దరు అన్నదాతల ఆత్మహత్య(Brothers suicide) చేసుకున్నారు.

అప్పుల(debts) భారంతో మరో ఇద్దరు అన్నదాతల ఆత్మహత్య(Brothers suicide) చేసుకున్నారు. వరంగల్(Warangal), మెదక్(Medak) జిల్లాల్లో మరో ఇద్దరు రైతులు(Farmers) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన హింగె శోభన్ బాబు (48) మిర్చి, ఇతర పంటలు సాగు చేస్తున్నాడు. సుమారు 10 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అప్పులు(Debt) ఎలా తీర్చాలో తెలియక మనోవేదన చెందాడు. దీంతో మిర్చి తోట వద్దకు వెళ్లి పురుగుల మందు(Insecticide) తాగి, పెద్ద కూతురు రవళికి ఫొన్ చేసి చెప్పాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఫలితం లేదు. శోభన్‌బాబు చికిత్స పొందుతూ మృతిచెందాడు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్‌కు చెందిన చాకలి దుర్గోల్ల బాలేశ్ (28)కు రెండెకరాల భూమి ఉంది. అందులో బోరుబావులు తవ్వించినా చుక్కనీరు పడలేదు. వేసిన పంట వేసినట్టే ఎండి పోవడంతో తీవ్రంగా కలత చెందాడు. దీంతో ఇంట్లో దూలానికి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated On 27 Nov 2024 7:05 AM GMT
Eha Tv

Eha Tv

Next Story