రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలు నవంబర్ 29, 30 తేదీల్లో మూతపడతాయని అధికారులు ప్రకటించారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(assembly Elections) దృష్ట్యా తెలంగాణ(Telangana)లోని అన్ని విద్యాసంస్థలు(Educational Institutions) నవంబర్ 29, 30 తేదీల్లో మూతపడతాయని అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి(Anudeep Durishetty) మాట్లాడుతూ.. డిసెంబర్ 1న సాధారణ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని.. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 30న పోలింగ్ జరగనుందని తెలిపారు.

రాష్ట్రంలో అనేక విద్యా సంస్థలు పోలింగ్ కేంద్రాలుగా ఉన్నందున‌.. పోలింగ్ ఏర్పాట్లను సులభతరం చేయడానికి అధికారులు నవంబర్ 30న సెలవు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కంపెనీలు, ఫ్యాక్టరీలు మొదలైన వాటికి సెలవు ప్రకటించింది.

ఇదిలావుండగా.. ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఐటీ కంపెనీలతో పాటు కొన్ని ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు సెలవులు ప్రకటించడం లేదని ఫిర్యాదులు అందాయని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వికాస్ రాజ్(Vikas Raj) తెలిపారు. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 135 బి అమలులో ఉన్న కార్మిక చట్టాలను ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు.

నవంబర్ 30న అన్ని సంస్థలు, కంపెనీలు సెలవును మంజూరు చేశాయో లేదో తనిఖీ చేయాలని లేబర్ కమిషనర్‌(Commissioner of Labour)ను సీఈవో వికాస్ రాజ్ అభ్యర్థించారు. లేని పక్షంలో ఎన్నికల చట్టాలతో పాటు అమలులో ఉన్న ఇతర కార్మిక చట్టాల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated On 28 Nov 2023 11:20 PM GMT
Yagnik

Yagnik

Next Story