శేరిలింగంపల్లి(Serilingampally) కాంగ్రెస్(Congress) అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్(Jagdeeswar Goud) ఎన్నికల ప్రచారంలో(Election Campaign) పాల్గొన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర‌రావు(Tummala Nageswara Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. సెటిలర్స్ అనే మాట తీసేయండి.. ఇది మన గడ్డ.. ఇక్కడే జీవిస్తున్నాం.. ఎవడబ్బ సొత్తు కాదని అన్నారు. పూజ్యులు ఎన్టీఆర్(NTR) సంక్షేమ రాజ్యం.. రామ రాజ్యం చూసాం.. రామరాజ్యం అంటే ఎన్టీఆర్ రాజ్యం అని పేర్కొన్నారు.

శేరిలింగంపల్లి(Serilingampally) కాంగ్రెస్(Congress) అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్(Jagdeeswar Goud) ఎన్నికల ప్రచారంలో(Election Campaign) పాల్గొన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర‌రావు(Tummala Nageswara Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. సెటిలర్స్ అనే మాట తీసేయండి.. ఇది మన గడ్డ.. ఇక్కడే జీవిస్తున్నాం.. ఎవడబ్బ సొత్తు కాదని అన్నారు. పూజ్యులు ఎన్టీఆర్(NTR) సంక్షేమ రాజ్యం.. రామ రాజ్యం చూసాం.. రామరాజ్యం అంటే ఎన్టీఆర్ రాజ్యం అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆత్మ గౌరవ రాజకీయాలు నేర్పితే .. ఆత్మ విశ్వాస రాజకీయాలు చంద్రబాబు(Chandrababu) నేర్పారని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే హైదరాబాద్(Hyderabad) అభివృద్ధి జ‌రిగింద‌న్నారు. ఐటీ టవర్స్(IT Towers), ఔటర్ రింగు రోడ్డు(Outter Ring Road),శంషాబాద్ ఎయిర్ పోర్ట్(Airport), ఇన్ ఫ్రా తో చంద్రబాబు హైద‌రాబాద్‌ను విశ్వనగరంగా పునాది వేశార‌ని అన్నారు. విజన్-2020 తో ఉమ్మడి రాష్ట్రం అభివృద్ది చేశారని పేర్కొన్నారు.

రాజకీయంగా నష్టపోయినా తెలంగాణ ఏర్పాటుతో సోనియా గాంధీ(Sonia Gandhi) చరిత్రలో నిలిచారని అన్నారు. తెలంగాణ దోపిడీ, మాఫీయా, కబ్జా రాజ్యంగా మారిందన్నారు. ప్రజా ప్రతినిధులు మాఫీయాగా మారారు. పోలీసులను ఎమ్మెల్యేల‌కు అప్పజెప్పార‌ని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం మార్పు కోరుతున్నారు. ఓ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కోసం కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలన్నారు. ఈ ఎన్నికలు చారిత్రాత్మ‌కమైనవి. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కావాలన్నారు. మాట తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలన్నారు.

Updated On 28 Nov 2023 4:42 AM GMT
Ehatv

Ehatv

Next Story