TTDP President Kasani Gnaneshwar : తెలంగాణలో కాంగ్రెస్ కంటే తామే బలంగా ఉన్నాం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Election) తెలుగుదేశంపార్టీ(TDP) పోటీ చేయదంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) ఖండించారు. ఈ విషయంపై బుధవారం ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు.

TTDP President Kasani Gnaneshwar
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Election) తెలుగుదేశంపార్టీ(TDP) పోటీ చేయదంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) ఖండించారు. ఈ విషయంపై బుధవారం ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటిని పట్టించుకోవద్దని కాసాని తెలిపారు. తెలంగాణలో తెలుగుదేశంపార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో తెలుగుదేశంపార్టీ బలంగా ఉందని, కాంగ్రెస్(Congress) పార్టీ కంటే టీడీపీనే బలంగా ఉందని చెప్పుకొచ్చారు. జనసేన(Janasena) అధినే పవన్ క్యలాణ్‌తో(Pawan kalyan) ముందుకు వెళ్లాలా వద్దా అన్నది భవిష్యత్తులో తెలుస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ నిరసన కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. మంగళవారం చంద్రబాబు బయటకు వస్తారని ఆశిస్తున్నామని చెబుతూ అభ్యర్థుల లిస్టుతో పాటు మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామని అన్నారు. చంద్రబాబు ఆలోచనలతో పాటు తెలంగాణకు అవసరమైన అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోను రూపొందిస్తామని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు.
