హైదరాబాద్‌లో(Hyderabad) విద్యుత్(Current) కోతలు అమల్లోకి రానున్నాయని TSSAPDCL MD ముషారఫ్ అలీ ఫరూఖీ(Musharraf Ali Farooqui) X(Twitter) ద్వారా వెల్లడించారు. మెయింటెనెన్స్, మరమ్మతు పనుల్లో భాగంగా విద్యుత్ కోతలు(Power cuts) ఉంటాయని తెలిపారు. ప్రజలకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని అన్నారు. ఈరోజు నుంచి ఫిబ్రవరి 10 వరకు కరెంట్ కోతలు ఉంటాయన్నారు.

Power Cuts In Hyderabad
హైదరాబాద్‌లో(Hyderabad) విద్యుత్(Current) కోతలు అమల్లోకి రానున్నాయని TSSAPDCL MD ముషారఫ్ అలీ ఫరూఖీ(Musharraf Ali Farooqui) X(Twitter) ద్వారా వెల్లడించారు. మెయింటెనెన్స్, మరమ్మతు పనుల్లో భాగంగా విద్యుత్ కోతలు(Power cuts) ఉంటాయని తెలిపారు. ప్రజలకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని అన్నారు. ఈరోజు నుంచి ఫిబ్రవరి 10 వరకు కరెంట్ కోతలు ఉంటాయన్నారు. నిర్వహణ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్లపైకి వచ్చిన చెట్ల కొమ్మలను తొలగిస్తామని, ఒక్కో ఫీడర్‌కు ఒకరోజు మాత్రమే కోతలు ఉంటాయన్నారు. జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధిలో 3 వేల ఫీడర్లు ఉన్నాయని వీటి పరిధిలో 15 నిమిషాల నుంచి 2 గంటల వరకు విద్యుత్‌ను నిలిపివేసి నిర్వహణ పనులు పూర్తి చేయాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. విద్యుత్ అంతరాయ వివరాలు http://tssouthernpower.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తుంటామన్నారు. కాగా కాంగ్రెస్(Congress) ప్రభుత్వం వస్తే కరెంట్ బంద్ అని తాము చేసిన ప్రచారం నిజమే అవుతుంది కదా అని బీఆర్‌ఎస్(BRS) నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
