ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే విష‌య‌మై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) శుభవార్త చెప్పింది. సీఎం కేసీఆర్(CM KCR) అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గం(Cabinet) చర్చించింది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)ను ప్రభుత్వంలో విలీనం చేసే విష‌య‌మై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు త్వరలో జరగ‌నున్న‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నది. అనంతరం 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు(RTC Employees) ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. కేబినెట్ నిర్ణయంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న‌ ఆర్టీసీ ఉద్యోగుల కల నెర‌వేర‌నుంది. మంత్రి కేటీఆర్(Minister KTR) ప్ర‌క‌ట‌న అనంత‌రం ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబాలలో ఆనందోత్సవాలు నెల‌కొన్నాయి.

ప్రజారవాణాను పటిష్టం చేసేందుకే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. ఆర్టీసీని కాపాడేందుకు, ప్రజారవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు, సేవలను ఇంకా విస్తృత పరిచేందుకు సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. విధివిధానాలు, నిబంధనలను రూపొందించేందుకు అధికారులతో కూడిన సబ్‌ కమిటీని ఏర్పాటుచేసిన‌ట్లు వెల్ల‌డించారు.

సబ్‌ కమిటీ(Sub Committee)లో అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు(Ramkrishna Rao), ఆర్‌అండ్‌బీ, రవాణాశాఖ, జేఏడీ శాఖ కార్యదర్శులు, కార్మికశాఖ స్పెషల్‌ సెక్రెటరీ సభ్యులుగా ఉంటారు. ఈ సబ్‌ కమిటీ పూర్తి నివేదికను వెంటనే సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. 3వ తేదీన ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశంలోనే ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను ప్రారంభిస్తూ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనున్నదని పేర్కొన్నారు.

Updated On 31 July 2023 7:47 PM GMT
Yagnik

Yagnik

Next Story