RTC MD VC Sajjanar : ఓటు వజ్రాయుధం.. పోలింగ్లో పాల్గొనండి
సీనియర్ ఐపీఎస్ అధికారి(IPS Officier), టీఎస్ఆర్టీసీ వీసీ సజ్జనర్(RTC MD VC Sajjanar) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొండాపూర్ చిరాక్ పబ్లిక్ స్కూల్(Chirak Public School) లోని 375వ పోలింగ్ బూత్(Polling Station) లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు వేశారు.

RTC MD VC Sajjanar
సీనియర్ ఐపీఎస్ అధికారి(IPS Officier), టీఎస్ఆర్టీసీ వీసీ సజ్జనర్(RTC MD VC Sajjanar) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొండాపూర్(Kondapur) చిరాక్ పబ్లిక్ స్కూల్(Chirak Public School) లోని 375వ పోలింగ్ బూత్(Polling Station) లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని అన్నారు. మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని ఓటు హక్కు చాటుతుందన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(TS Election 2023) ఓటర్లందరూ పాల్గొని తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత, విద్యావంతులు ఓటు వేయడాన్ని తమ బాధ్యతగా భావించి.. పోలింగ్ లో పాల్గొనాలని సూచించారు.
