టీఎస్ఆర్టీసీ(TSRTC) ఎండీ వీసీ సజ్జనర్(VC Sajjanar).. ప్రజా క‌వి, గాయకుడు గద్దర్(Gaddar) పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. గ‌ద్ద‌ర్‌ను క‌డ‌సారి చూసేందుకు సోమ‌వారం ఎల్బీస్టేడియంకు(LB Stadium) వెళ్లిన సజ్జనర్.. ఆయ‌న‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సజ్జనర్.. గద్దర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గద్దర్ తో త‌న‌కు దశాబ్ద కాలంగా పరిచయం ఉంద‌ని తెలిపారు.

అనేక సార్లు వ్యక్తిగతంగా నన్ను కలిశారని పేర్కొన్నారు. నెల రోజుల క్రితం కూడా ఆయన నన్ను వ్యక్తిగతంగా కలిశార‌ని తెలిపారు. ఆ స‌మ‌యంలో ప్రజా రవాణా వ్యవస్థ(Public transport) ప్రాముఖ్యతతో పాటు బస్‌తో తనకున్న అనుబంధాన్ని వివరించారని చెప్పారు. ఆయ‌న‌ ఎన్నో విషయాలను నాతో పంచుకున్నారని.. తను చెప్పవలసిన విషయాన్ని ఎంతో ధైర్యంగా, మృదువుగా చెప్పేవారని జ్క్షాప‌కాల‌ను నెమ‌రువేసుకున్నారు.

పాటను గద్దర్‌ వ్యాపారంగా చూడలేదని.. పాట ద్వారా ప్రజా సమస్యలను బయటకు తెచ్చారని సజ్జనర్ అన్నారు. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల కష్టాల గురించి ఒక పాటను రాసి.. సంస్థకు అంకితం చేస్తానని చెప్పారని.. అంతలోనే గద్దర్‌ మరణవార్త వినడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఒక దిగ్గ‌జ‌ కవిని, యాక్టివిస్ట్‌ను కొల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated On 7 Aug 2023 6:26 AM GMT
Ehatv

Ehatv

Next Story