టీఎస్‌ఆర్టీసీ(TSRTC) బస్సులలో పురుషులకు(Men) ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయించాలనే ఆలోచన చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. బస్‌లో ఉండే 55 సీట్లలో 20 సీట్లు పురుషులకు రిజర్వ్(Reserved Seats) చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టీఎస్‌ఆర్టీసీ(TSRTC) బస్సులలో పురుషులకు(Men) ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయించాలనే ఆలోచన చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. బస్‌లో ఉండే 55 సీట్లలో 20 సీట్లు పురుషులకు రిజర్వ్(Reserved Seats) చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని డిపోల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. మేనేజర్ల అభిప్రాయాలను కూడా ఉన్నతాధికారులు తెలుసుకుంటున్నారు. ఒకవేళ పురుషులకు సీట్లు కేటాయిస్తే వ్యతిరేకత ఏమైనా వస్తుందా? అన్నది కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం(Women Free Bus) కల్పించిన తర్వాత పురుషులకు సీట్లు దొరకడం లేదట! టికెట్ కొన్న తమకు సీట్లు లేకపోతే ఎలా అని కొందరు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.