హైదరాబాద్‌ వీఎస్‌టీ దగ్గర ఉన్న ఆర్‌టిసి కళాభవన్‌(RTC Kalabhavan)ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) సీజ్‌ చేసింది. సుచిరిండియా హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో రెంట్‌ కాంట్రాక్టును రద్దు చేసుకుంది. సుచిరిండియా హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 2016లో టీఎస్‌ఆర్‌టిసికి చెందిన ఆర్టీసీ కళాభవన్‌ను రెంట్‌కు తీసుకుంది. ఈ భవన్‌లో పెద్ద కళ్యాణమండపం, కళాభవన్‌, మరో మూడు మినీ హాళ్లను లీజ్‌కు తీసుకుంది.

హైదరాబాద్‌ వీఎస్‌టీ దగ్గర ఉన్న ఆర్‌టిసి కళాభవన్‌(RTC Kalabhavan)ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) సీజ్‌ చేసింది. సుచిరిండియా హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో రెంట్‌ కాంట్రాక్టును రద్దు చేసుకుంది. సుచిరిండియా హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 2016లో టీఎస్‌ఆర్‌టిసికి చెందిన ఆర్టీసీ కళాభవన్‌ను రెంట్‌కు తీసుకుంది. ఈ భవన్‌లో పెద్ద కళ్యాణమండపం, కళాభవన్‌, మరో మూడు మినీ హాళ్లను లీజ్‌కు తీసుకుంది. ఆ విధంగా ఆర్టీసీతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం నెలకు 25.16 లక్షల రూపాయలను టీఎస్‌ఆర్‌టిసికి చెల్లించాలి. కానీ గత కొంత కాలంగా సుచిరిండియా సంస్థ అద్దె చెల్లించడం లేదు. ఇప్పటికీ 6.55 కోట్ల రూపాయలు సుచిరిండియా హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బకాయి పడింది. పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ టిఎస్‌ఆర్‌టిసి అధికారులు పలుమార్లు సుచిరిండియాకు నోటీసులు పంపించారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోయే సరికి కళాభవన్‌ను టిఎస్‌ఆర్‌టిసి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్‌ చేశారు. సుచిరిండియా కాంట్రాక్ట్ ను రద్దు చేశారు. "సుచిరిండియా సంస్థ ఒప్పందం ప్రకారం టీఎస్‌ఆర్‌టిసికి అద్దె చెల్లించడం లేదు. కాంట్రాక్టు ను రద్దు చేసి ఆర్టీసీ కళా భవన్‌ను సీజ్‌ చేస్తున్నాం." అని ఆర్టీసీ కళాభవన్‌ గేట్‌ దగ్గర ఒక పత్రాన్ని అధికారులు అతికించారు.

Updated On 27 April 2023 4:19 AM GMT
Ehatv

Ehatv

Next Story