తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సోమవారం ఓటింగ్‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తెలంగాణ నుంచి వెళ్లే ఆంధ్రప్రదేశ్‌వాసుల కోసం టిఎస్‌ఆర్‌టిసి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సోమవారం ఓటింగ్‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తెలంగాణ నుంచి వెళ్లే ఆంధ్రప్రదేశ్‌వాసుల కోసం టిఎస్‌ఆర్‌టిసి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ఆదివారం ఆంధ్రప్రదేశ్‌కు 590 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామనిపేర్కొంది. హైదరాబాద్-విజయవాడ రూట్‌లో 140 అదనపు బస్సులను ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్ కోసం ఉంచినట్లు సమాచారమిచ్చింది. ఓటర్లు సులభంగా ప్రయాణించేందుకు 3,000 కంటే ఎక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.

విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలని TSRTC కోరింది. టిక్కెట్ల ముందస్తు రిజర్వేషన్ కోసం వారు http://tsrtconline.inకి లాగిన్ చేయవచ్చు” అని TSRTC పేర్కొంది. హైదరాబాద్ నుంచి ఏపీలోని ఇతర జిల్లాలకు దాదాపు 1,500 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. ఈ బస్సులు జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరంగర్ తదితర ప్రాంతాల నుంచి తిరుగుతున్నాయి. ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులను అందుబాటులో ఉంచాలని యాజమాన్యం క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో సోమవారం నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఏపీలో అసెంబ్లీకి కూడా పోలింగ్ జ‌రుగుతుంది.

Updated On 12 May 2024 10:31 AM GMT
Yagnik

Yagnik

Next Story