టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టిక్కెట్లను కమిషన్ ఆదివారం విడుదల చేయనుంది. జూన్ 11న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టిక్కెట్లు ఆదివారం నుంచి జూన్ 11 వరకు డౌన్‌లోడ్ చేసుకోవడానికి https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది.

టీఎస్‌పీఎస్సీ(TSPSC) గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టిక్కెట్ల(Group 1 Prelims Hall Ticket )ను కమిషన్ ఆదివారం విడుదల చేయనుంది. జూన్ 11న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టిక్కెట్లు ఆదివారం నుంచి జూన్ 11 వరకు డౌన్‌లోడ్ చేసుకోవడానికి https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(Telangana State Public Service Commission) పేర్కొంది. అక్టోబర్ 16, 2022న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు జారీ చేయబడిన హాల్ టిక్కెట్లు.. జూన్ 11న జరగబోయే పరీక్షకు చెల్లుబాటు కావని పేర్కొంది. అభ్యర్థులు కొత్తగా హాల్ టికెట్లు(Hall Tickets) డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. గ‌తంలో గ్రూప్-1 ప‌రీక్ష జ‌ర‌గ‌గా పేప‌ర్ లీకేజీ(Paper Leakage) కార‌ణంగా ర‌ద్దుచేశారు.

Updated On 3 Jun 2023 11:07 PM GMT
Yagnik

Yagnik

Next Story