తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా ప్రత్రాన్ని గవర్నర్ తమిళిసైకి అందజేయగా..
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) చైర్మన్ జనార్దన్ రెడ్డి(Janardhan Reddy) రాజీనామా(Resign) చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా ప్రత్రాన్ని గవర్నర్ తమిళిసై(Tamilisai)కి అందజేయగా.. ఆమె వెంటనే ఆమోదించి.. చీఫ్ అడ్వైజరీ కౌన్సిల్‌కు పంపారు. జనార్దన్ రెడ్డి రాజీనామాకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని కలిశారు.
అంతకుముందు సీఎం టీఎస్‌పీఎస్‌సీ పరీక్షా కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష, పునర్వ్యవస్థీకరణకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేయబడిన ఉద్యోగాలు, జారీ చేసిన నోటిఫికేషన్‌లపై వివరణాత్మక నివేదికలను తీసుకుని, తదుపరి సమీక్ష సమావేశానికి హాజరు కావాలని టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌కు ముఖ్యమంత్రి కార్యాలయం(CMO) ఆదేశాన్ని జారీ చేసింది.
టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన పోటీ పరీక్షల పేపర్ల లీకేజీ(Paper Leakage), వాయిదాలపై తెలంగాణ నిరుద్యోగ యువతలో విస్తృతమైన గందరగోళం, నిరాశ నెలకొన్న తరుణంలో టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డిని తొలగించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. అయితే అప్పటి ప్రభుత్వం ఆయనను కొనసాగించగా.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రాజీనామా చేయమని సూచించినట్లు తెలుస్తోంది.