వేసవితాపంతో(Summer Heat) అల్లాడిపోతున్న తెలంగాణ(Telangana) ప్రజలకు గుడ్‌న్యూస్‌ . నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయనే చల్లటి కబురును హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం(Hyderabad Meterological department) చెప్పింది. గురువారం నుంచి 19వ తేదీ వరకు అక్కడక్కడ తేలికపాటు లేదా మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

వేసవితాపంతో(Summer Heat) అల్లాడిపోతున్న తెలంగాణ(Telangana) ప్రజలకు గుడ్‌న్యూస్‌ . నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయనే చల్లటి కబురును హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం(Hyderabad Meterological department) చెప్పింది. గురువారం నుంచి 19వ తేదీ వరకు అక్కడక్కడ తేలికపాటు లేదా మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, వరంగల్‌, గద్వాల, హనుమకొండ, నారాయణపేట జిల్లాల్లో గురువారం వర్షాలు కురుస్తాయి. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను(Yellow alert) జారీ చేసింది వాతావరణశాఖ. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉదయం ఎండకాసినా, సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. 38 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదట! ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడుతాయని, నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు

Updated On 16 May 2024 2:22 AM GMT
Ehatv

Ehatv

Next Story