గ్రూప్-1 పరీక్షలపై(Group-1 Exams) నేడు తెలంగాణ హైకోర్టులో(TS High court) విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశించింది. గ్రూపు-1 ఫిలిమ్స్ రద్దుపై సింగిల్ బెంజ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం రిట్ పిటిషన్ ను హైకోర్టు లో దాఖలు చేసింది.
గ్రూప్-1 పరీక్షలపై(Group-1 Exams) నేడు తెలంగాణ హైకోర్టులో(TS High court) విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశించింది. గ్రూపు-1 ఫిలిమ్స్ రద్దుపై సింగిల్ బెంజ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం రిట్ పిటిషన్ ను హైకోర్టు లో దాఖలు చేసింది. గ్రూపు-1 పరీక్షలో బయోమెట్రిక్ పెట్టకపోవడానికి సాంకేతిక సమస్యలే కారణమని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది.
విచారణ అనంతరం సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంజ్ సమర్ధిస్తూ తీర్పునిచ్చింది. పరీక్ష రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సబబే అని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంజ్ కీలక తీర్పు వెల్లడించింది. జులై 11న నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేస్తూ తీర్పు వెల్లడించింది.
పరీక్ష నిర్వహించే సమయంలో బయోమెట్రిక్ తీసుకోవాలి. కానీ నోటిఫికేషన్‌లో ఇచ్చిన విధంగా అభ్యర్థుల నుండి బయోమెట్రిక్ తీసుకోలేదు. టిఎస్పిఎస్సి రూల్స్(TSPSC Rules) పాటించలేదు. అంతేకాకుండా రెండోసారి గ్రూప్-1 పరీక్ష రాసింది 2,33,506 మంది అభ్య ర్థులు అయితే.. అభ్యర్థుల సంఖ్యను కూడా టీఎస్‌పీఎస్సీ కోర్టుకు తప్పుగా చూపించింది. పరీక్షా సమయంలో బయోమెట్రిక్ తీసుకోలేదని ముగ్గురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టులో విచారణ కొనసాగింది. పరీక్షలు సరిగ్గా నిర్వహించ లేకపోయారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే టీఎస్‌పీఎస్సీ ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తుందని హైకోర్టు మండిపడింది. ఈ మేరకు హైకోర్టు గ్రూప్-1 పరీక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.