హైదరాబాద్‌లో కోట్ల రూపాయల విలువైన భూములను గత ప్రభుత్వాలు అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) నుంచే ఈ భూపందేరం మొదలయ్యింది. సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన భూములు, స్టేడియంలను అప్పనంగా ఐఎంజీ భరత(IMG bharath) అనే సంస్థకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పగించేందుకు చేసిన ప్రయత్నాలకు సంబంధించిన కేసులో హైకోర్టు(High Court) తెలంగాణ ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు వేసింది.

హైదరాబాద్‌లో కోట్ల రూపాయల విలువైన భూములను గత ప్రభుత్వాలు అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) నుంచే ఈ భూపందేరం మొదలయ్యింది. సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన భూములు, స్టేడియంలను అప్పనంగా ఐఎంజీ భరత(IMG bharath) అనే సంస్థకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పగించేందుకు చేసిన ప్రయత్నాలకు సంబంధించిన కేసులో హైకోర్టు(High Court) తెలంగాణ ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు వేసింది. భూముల రిజిస్ట్రేషన్లను ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar Reddy) ప్రభుత్వం రద్దుచేసిన తర్వాత ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీసింది. ఒక ప్రైవేటు కంపెనీకి అడ్డగోలుగా భూములను అప్పగించారని చెప్పి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం, ఆ తర్వాత అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది.భూములను ఏకపక్షంగా అప్పగించటానికి ప్రయత్నించిన దోషులు ప్రభుత్వంలోనే ఉన్నారని వ్యాఖ్యానించింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకీ చెందిన 450 ఎకరాలు, ఐఎంజీ అకాడమీ ఆఫ్‌ భరత ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆఫీస్‌ కోసం జూబ్లీహిల్స్‌లో అయిదు ఎకరాలు కలిపి మొత్తం 850 ఎకరాలతోపాటు హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన పలు స్టేడియంలను ఐఎంజీ సంస్థకు అప్పగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2003 ఆగస్టు 9న ఒప్పందం చేసుకున్నది. ఆ తర్వాత వచ్చిన వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం సదరు ఒప్పందాన్ని రద్దుచేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఐఎంజీ భరత దాఖలుచేసిన పిటిషన్‌, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని దాఖలైన మరో రెండు వ్యాజ్యాలను కలిపి గురువారం హైకోర్టు విచారించింది. ఈ నెల 28న జరిగే విచారణ సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకొన్నారనే వివరాలు అందజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరథే, జస్టిస్‌ జే అనిల్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Updated On 23 Feb 2024 1:03 AM GMT
Ehatv

Ehatv

Next Story