☰
✕
బీఆర్‌ఎస్(BRS) తలపెట్టిన గిరిజన రైతు ధర్నాకు(Girijana rythu dharna) హైకోర్టు గ్రీన్ సిగ్నల్
x
గిరిజనులు, దళితులపై జరిగిన దాడికి నిరసనగా మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్(BRS) తలపెట్టిన గిరిజన రైతు ధర్నాకు(Girijana rythu dharna) హైకోర్టు గ్రీన్ సిగ్నల్(high court) ఇచ్చింది. ఈనెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అనుమతిస్తూ.. ధర్నాలో వెయ్యి మంది మాత్రమే పాల్గొనాలని షరతు విధించింది. నిజానికి మహబూబాబాద్(Mahaboob nagar) జిల్లా కేంద్రంలో గిరిజన రైతు ధర్నా ఇవాళ చేపట్టాల్సి ఉండింది. కానీ పోలీసులు అనుమతించకపోవడంతో గిరిజన రైతు ధర్నాకు అనుమతి ఇవ్వాలంటూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
Eha Tv
Next Story