గణతంత్ర దినోత్సవం(Republic day) వేళ తెలంగాణ ప్రభుత్వం రైతులకు(Farmers) మరో గుడ్ న్యూస్ చెప్పింది. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రూ.2 లక్షల రుణమాఫీపై గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్(Tamilsai Soundar Rajan) కీలక ప్రకటన చేశారు.

గణతంత్ర దినోత్సవం(Republic day) వేళ తెలంగాణ ప్రభుత్వం రైతులకు(Farmers) మరో గుడ్ న్యూస్ చెప్పింది. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రూ.2 లక్షల రుణమాఫీపై గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్(Tamilsai Soundar Rajan) కీలక ప్రకటన చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన(Flag hosting) అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. తెలంగాణ రైతులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న రూ.2 లక్షల రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ విషయంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. ఒక పద్ధతి ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేయడానికి ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోందని రైతులకు శుభవార్త చెప్పారు. అలాగే.. రైతు భరోసా(Rythu bharosa) పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు పరిచేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. రైతులు ఎవరూ రైతు భరోసా గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. వరంగల్ డిక్లరేషన్‌లో రైతులకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కార్యచరణతో పని చేస్తోందన్నారు. అలాగే ఉద్యోగాల భర్తీపై యువత ఎలాంటి అపోహలకూ గురికావద్దని సూచించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన పూర్తి అయిన వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు అవుతుందని ఆమె హామీ ఇచ్చారు.

Updated On 26 Jan 2024 4:09 AM GMT
Ehatv

Ehatv

Next Story